Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-2021: బెంగళూరు కెప్టెన్సీ మధ్యలోనే విరాట్ కోహ్లీ అవుటా?

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:47 IST)
ఐపీఎల్‌-2021 మధ్యలోనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ నుంచి టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిని తొలగించనున్నారు. ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గని అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ కోహ్లి పూర్తిగా విఫలం కావటం వల్లే ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ గత వారం ప్రకటించడం తెలిసిందే. అటు ఐపీఎల్‌లో వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 
 
కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఏర్పడుతున్న ఒత్తిడి తన ఆటపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కారణంగా కోహ్లీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వన్డేల్లో మాత్రం టీమిండియాకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్‌ వరకు క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న చర్చ కూడా జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments