ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి మిచెల్ మార్ష్ దూరం!!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:38 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లలో ఒకరైన మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2020 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న ఈ జట్టుకు మార్ష్ దూరంకానుండటం మరింత కుంగదీయనుంది. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడిన విషయం తెల్సిందే. ఈ గాయం పెద్దది కావడంతో మొత్తం ఐపీఎల్‌కే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో అతడు బంతి వేసిన అనంతరం పిచ్‌పై జారి పడ్డాడు. ఈ క్రమంలో కాలి మడమ నొప్పితో విలవిల్లాడాడు. 
 
ఫిజియో వచ్చి చికిత్స చేసినా ఓవర్‌ మధ్యలోనే మైదానం వీడాడు. మార్ష్‌ గాయం చాలా తీవ్రంగానే కనిపిస్తోందని, ఈ స్థితిలో అతను మిగతా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడం అనుమానమేనని జట్టు వర్గాలు తెలిపాయి. మార్ష్‌ స్థానంలో డాన్‌ క్రిస్టియన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్‌రైజర్స్‌ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండా కల్వకుంట్ల కవిత రాజకీయ యాత్ర?

దుర్గాపూర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం : బాధితురాలి స్నేహితుడు అరెస్టు

గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఆకస్మిక మృతి

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం - ఏపీకి పొంచివున్న తుఫానుల గండం

56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

తర్వాతి కథనం
Show comments