క్రిస్ గేల్ అదుర్స్ రికార్డ్.. బౌండరీలతో 10వేల పరుగులు.. 1027 ఫోర్లు, 982 సిక్సులు

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:59 IST)
కరేబియన్ క్రికెట్ సునామి క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా జనవరి నుంచి పిచ్‌లో అడుగుబెట్టని వెస్టిండీస్ వెటరన్ నేరుగా క్రీజులోకి దూకీ దూకడంతోనే పంజాబ్‌ను గెలిపించాడు. ఐపీఎల్ 2020లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అద్భుతంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన గేల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఫుడ్‌ పాయిజన్ కారణంగా ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లపాటు బెంచ్‌కే పరిమితమైన గేల్.. ఆర్సీబీపై బరిలో దిగి అభిమానులను అలరించాడు. జనవరి తర్వాత తొలిసారి బ్యాట్ పట్టిన గేల్.. ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్లతో అభిమానులను క్రిస్ గేల్ అలరించాడు. టీ20ల్లో అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. 13వేల 349 రన్స్‌తో.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 4500 పరుగులు సాధించిన ఆటగాడిగా అదరగొట్టాడు. 

కరేబియన్ క్రికెట్ దిగ్గజం బౌండరీల ద్వారానే పది వేల పరుగుల్ని పూర్తి చేయడం విశేషం. టీ20ల్లో గేల్ 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు. ప్రస్తుతం గేల్ కాకుండా కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ టీ20ల్లో పది వేలకుపైగా పరుగులు చేశారు.
 
ఇదిలా ఉంటే.. తాజాగా కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో గేల్‌ తన అర్థసెంచరీ పూర్తి చేశాక ఒక సన్నివేశం చోటుచేసుకుంది. ఫిప్టీ పూర్తయిన తర్వాత బ్యాట్‌ పైకెత్తిన గేల్‌ బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్‌ను చూపించాడు. ఆ స్టిక్కర్‌పై ది బాస్‌ అని రాసి ఉంది. బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్‌ ద్వారా గేల్‌ ఒక మెసేజ్‌ను పాస్‌ చేశాడు. 'అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను చూపించే ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి' అంటూ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

తర్వాతి కథనం
Show comments