Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : చతికిలపడిన సన్ రైజర్స్ - కోల్‌కతా విజయం

Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (11:41 IST)
ఐపీఎల్ 2020 టోర్నోలో భాగంగా శనివారం రాత్రి అబుదాబీ వేదికగా జరిగన ఎనిమిదో లీగ్ మ్యా‌లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ప్రత్యర్థి జట్టు ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ అలవోకగా సాధించింది. దీంతో కేకేఆర్ విజయాన్ని నమోదు చేయగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. అదేసమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు మొదట్లోనే జానీ బెయిర్‌ స్టో వికెట్‌‌ను కోల్పోయింది. ఆపై వార్నర్‌‌కు జత కలిసిన మనీష్‌ పాండే, సహా, దాని తర్వాత సాహాల జోడీ ముందుకు సాగుతున్నట్టు కనిపించినా, కేకేఆర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు వారి ఆట సాగలేదు. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసిన సన్ రైజర్స్, స్లాగ్‌ ఓవర్లలో పరుగులు సాధించలేక తడబడింది. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 143 పరుగులు సాధించింది. 
 
దీన్ని కేకేఆర్ మరో 2 ఓవర్లు మిగిలివుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో శుభమన్‌ గిల్ 70 పరుగులు, నితీష్‌ రాణా 26 పరుగులతో తమదైన పాత్ర వహించగా, ఇయాన్‌ మోర్గాన్‌ 42 పరుగులతో నాటౌట్ గా నిలిచి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments