Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధ్వంసకర బ్యాట్స్‌మెన్ల వికెట్లు తీయకుంటే ఓటమే.. మళ్లీ పుంజుకుంటాం : కేఎల్ రాహుల్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (09:44 IST)
ఏ జట్టుకైనా విధ్వంసకర ఆటగాళ్ల వికెట్లు తీయకుంటే ఓటమి తప్పదని పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టోర్నీలోభాగంగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ నిర్ధేశించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని చెన్నై జట్టు ఓపెనర్లే బాదేశారు. ఫలితంగా పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించి, తన ఖాతాలో ఐపీఎల్ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఈ ఓటమిపై పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ, తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసునని, మరింత బలంగా పుంజుకుంటేనే అవకాశాలు లభిస్తాయని అన్నాడు. ముఖ్యంగా, ఆదివారంనాటి మ్యాచ్‌లో తాము కనీసం ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయామని, తమ ప్లాన్‌ను అమలు చేయడంలో విఫలం అయ్యామని, విధ్వంసకర ఆటగాళ్లయిన షేన్ వాట్సన్, డూప్లెసిస్ వికెట్లు తీయకుంటే, ఏ జట్టుకు అయినా చిక్కులే మిగులుతాయని అన్నారు. 
 
వరుసగా ఓడిపోవడం బాధను కలిగిస్తోందని, తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం కష్టమేమీ కాదని అన్నాడు. తొలుత తాము బ్యాటింగ్ చేస్తున్న వేళ, పిచ్ నెమ్మదిగా ఉందని, సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలించిందని కేఎల్ రాహుల్ అన్నాడు. తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని, వారంతా తిరిగి పుంజుకుంటే, తమ జట్టు కూడా గెలుపు బాట పడుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments