ఐపీఎల్ 2020 : విరాటుడి రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ ప్లేయర్!!

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:34 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నారు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతంగా ఐదు వేల పరుగులు చేసిన విదేశీ క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఆదివారం రాత్రి అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో వార్నర్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు.
 
ఈ క్రమంలో డేవిడ్ వార్నర్... ఐదు వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో నాలుగో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. వార్నర్ కంటే ముందు సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్), విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)లు ఉన్నారు. ఈ ముగ్గురిలో సురేష్ రైనా మినహా మిగిలిన ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం సాగుతున్న ఐపీఎల్ 2020లో కూడా ఆడున్నారు.
 
అంతేకాకుండా, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. కోహ్లీ మొత్తం 157 మ్యాచ్‌లలో ఐదు వేల పరుగులు చేయగా, వార్నర్ మాత్రం కేవలం 135 మ్యాచ్‌లలో ఈ రికార్డును సాధించాడు. అయితే, సురేష్ రైనా 173, రోహిత్ శర్మ 187 మ్యాచ్‌లు ఆడారు.
 
అయితే, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డు మాత్రం చెక్కు చెదరలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు అంటే 5759 రన్స్ చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. మొత్తం 187 మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు, 38 అర్థ సెంచరీలతో కోహ్లీ ఈ రన్స్ చేశాడు. ఆ తర్వాత సురేష్ రైనా, రోహిత్ శర్మలు ఉన్నారు.
 
అంతేకాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ కూడా అధిక పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో ఐదో క్రికెటర్‌గా ఉన్నాడు. అంతేకాకుండా, ఆదివారం నాటి మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన ధావన్.. ఐదు వేల పరుగులు రికార్డును బ్రేక్ చేసేందుకు సమీపంలోనే ఉన్నాడు. ప్రస్తుతం ధావన్ 4938 పరుగులు చేయగా, డి విలియర్స్, ధోనీ, క్రిస్ గేల్, రాబిన్ ఊతప్ప, గౌతం గంభీర్‌లు టాప్-10 జాబితాలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments