ఐపీఎల్ 2020 ఏర్పాట్లను పర్యవేక్షించిన గంగూలీ!

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:36 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం టోర్నలో పాల్గొనే ఎనిమిది జట్లూ ఇప్పటికే అక్కడకు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే, ఐపీఎల్ టోర్నీ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా పర్యవేక్షించారు. 
 
ఈ నెల 9వ తేదీన దుబాయ్‌ వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నిబంధనల ప్రకారం ఆరు రోజల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా మంగళవారం ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌, ​సీవోవో హేమంగ్‌ అమిన్‌తో కలిసి దాదా షార్జా స్టేడియం పరిసరాలను సందర్శించాడు.
 
ఈ సందర్భంగా గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షార్జా స్టేడియం ఫోటోలను షేర్‌ చేశాడు. 'కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ దుబాయ్‌లో జరుగుతుంది. మ్యాచ్‌లు జరగనున్న షార్జా స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఐకానిక్‌ స్టేడియంలో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఐపీఎల్‌ ద్వారా భారత యువ ఆటగాళ్లు షార్జా స్టేడియంలో మ్యాచ్‌లు ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత దిగ్గజాలు సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ వంటి ఆటగాళ్లకు కూడా ఈ స్టేడియంలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు.
 
కాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీకి షార్జా స్టేడియంలో ఘనమైన రికార్డు ఉంది. ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలతో మొత్తం 700 పరుగులకు పైగా సాధించాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ మూడు వేదికల్లో ఒకటైన షార్జాలో మొత్తం 12 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్‌ 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఈ స్టేడియంలో తొలిమ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

తర్వాతి కథనం
Show comments