Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేల్ ఐపీఎల్ సరికొత్త రికార్డు... 300 సిక్సర్లతో అగ్రస్థానం, 3వ స్థానంలో ధోనీ

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (20:18 IST)
క్రిస్ గేల్ అంటేనే సిక్సర్ల వీరుడు అనే పేరుంది. ఇవాళ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ ఓ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ క్రికెట్టులో 300 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ క్రిస్ గేల్ 302 సిక్సర్లతో అగ్రస్థానంలో వున్నాడు. ఆ తర్వాత డివిల్లియర్స్ 192 సిక్సర్లు, ధోనీ 187 సిక్సర్లు, సురేష్ రైనా 186 సిక్సర్లు, రోహిత్ శర్మ 185 సిక్సర్లతో వరుసగా వున్నారు.
 
ఇకపోతే ముంబై ఇండియన్స్ మరోసారి పరాజయం చవిచూసింది. శనివారం నాడు చంఢీగర్‌లో జరిగిన ఐపీఎల్ 2019 పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్-కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 9వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ మరో 8 బంతులు మిగిలి వుండగానే 8 వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ పైన ఘన విజయం సాధించింది. 
 
177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవన్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఇక్కడ విశేషం ఏంటంటే... ఓపెనర్‌గా దిగిన రాహుల్ 57 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 71 పరుగులు చేసి నాటవుట్‌గా నిలవడం. గేల్ కూడా ముంబై ఇండియన్స్ బౌలర్లను అల్లాడించేశాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లు ఉతికి 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత అగర్వాల్ కూడా అదే దూకుడు సాగిస్తూ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. మిల్లర్ 14 పరుగులతో నాటవుట్‌గా నిలిచాడు. కేవలం నలుగురంటే నలుగురు ఆటగాళ్లు కింగ్స్ లెవన్ జట్టుకు విజయం సాధించిపెట్టేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

Rukmini Vasanth: ఎస్కే, రిషబ్, యష్, ఎన్టీఆర్‌తో రుక్మిణి వసంత్ సినిమాలు.. పాన్ ఇండియా హీరోయిన్‌గా?

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

తర్వాతి కథనం
Show comments