ఓడినా ఏం పర్లేదు.. చేపాక్‌లో చూసుకుంటాం.. ధోనీ

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:41 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ మార్చి 23వ తేదీ ప్రారంభమైంది. ఈ పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడింది.


తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ క్రమంలో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు సాధించింది. 
 
ముంబై క్రికెటర్లలో సూర్యకుమార్ యాదవ్ అత్యధికంగా 59 పరుగులు సాధించాడు. ఇక 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ అంబటి రాయుడు తొలి బంతికే అవుటై షాకిచ్చాడు. తదనంతరం బరిలోకి దిగిన సురేష్ రైనా 16 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఆపై జోడీ కట్టిన కేదార్ జాదవ్, ధోనీ నిలకడగా ఆడింది. 
 
అయినా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 133 పరుగులే సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కేదార్ జాదవ్ 58 పరుగులు సాధించాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం ద్వారా 100 ఐపీఎల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. 
 
ఈ మ్యాచ్ ఓటమికి అనంతరం మాట్లాడిన ధోనీ.. ఫీల్డింగ్, బౌలింగ్ చెత్తగా చేశామన్నాడు. బౌలింగ్ బాగా పరుగులు ఇచ్చేశాం. బ్రావోకు గాయం జట్టుకు మైనస్సేనని.. అతని స్థానంలో తగిన ఆటగాడు లేకపోవడం ఓటమికి కారణమైందని ధోనీ చెప్పుకొచ్చాడు. అయినా ఏం పర్లేదు.. తదుపరి మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగుతోంది. అక్కడ చూసుకుంటామని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments