Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని అలా నిషేధిస్తే సంతోషిస్తా.... వీరేంద్ర సెహ్వాగ్

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (20:50 IST)
కోపం అందరికీ సహజమే. ఒక్కోసారి ఆ కోపం ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతుంది. మిస్టర్ కూల్ అనే బిరుదును సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మ్యాచ్ పోటీ సమయంలో వ్యక్తం చేసిన ఆగ్రహంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
అంపైర్ నోబాల్ ఇచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఆగ్రహాన్ని అక్కడే అదిమిపెట్టకుండా బౌండరీ లైన్ ఆవల నుంచి ఎంతో ఆవేశంతో పిచ్ వద్దకు వచ్చి అంపైర్లతో వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఐతే ఎంత ఆగ్రహాన్ని తెప్పించే సంఘటనలు జరిగినా మౌనంగా వుండే ధోనీ ఇలా చిన్న విషయానికి క్రీడాస్ఫూర్తిని మర్చిపోయాడంటూ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
 
ఇక మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే మరో అడుగు ముందుకు వేసి ఘాటు విమర్శలు చేశాడు. ఏదో ఐపీఎల్ జట్టు కోసం కాకుండా భారత జట్టు కోసం కోప్పడి వుంటే తను ఎంతో సంతోషించేవాడినని పేర్కొన్నారు. పిచ్ మీద ఇద్దరు బ్యాట్స్‌మన్లు ఉన్నప్పుడు అంపైర్ నిర్ణయాన్ని వాళ్లు ప్రశ్నించగలరనీ, బయట వున్న ధోనీకి ఏం పని అంటూ విమర్శించారు. ఇలా ప్రవర్తించే ఆటగాళ్లకు జరిమానా విధిస్తే సరిపోదనీ, రెండుమూడు మ్యాచ్‌ల నుంచైనా నిషేధం వేటు వేయాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తీయని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

తర్వాతి కథనం
Show comments