రోహిత్ హిట్ కొట్టాడు.. చెన్నైకి చుక్కలు చూపించాడు.. రికార్డులు అదుర్స్

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (15:39 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతగడ్డపై తొలి పరాజయాన్ని చవిచూసింది. అదరగొట్టే బౌలింగ్‌‌తో ముంబై ఇండియన్స్‌ జట్టు చెన్నై పనిపట్టింది.


ముంబై బౌలర్లంతా సమష్టిగా రాణించడంతో చెన్నై స్కోరును అడ్డుకున్నారు. జట్టు కెప్టెన్‌ రోహిత్‌ పోరాటానికి బౌలింగ్‌తో న్యాయం చేశారు. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై పరుగుల పరంగా రెండో అతి పెద్ద ఓటమిని మూటగట్టుకుంది.  
 
చెన్నైని ఓడించడం ద్వారా ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరాయి. శుక్రవారం చేపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముంబై కెప్టెన్ రోహిత్ (67; 48 బంతుల్లో 6×4, 3×6) చెలరేగడంతో ముంబయి జట్టు ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు విజయంతో పాటు కొన్ని రికార్డులు కూడా వరించాయి.
 
అవేంటంటే..? చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మీద ఎక్కువ అర్ధ శతకాలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ తొలిస్థానంలో నిలిచాడు. సీఎస్కేపై హిట్‌ మ్యాన్‌ ఏకంగా 7 అర్ధ శతకాలు బాదాడు. తర్వాతి స్థానంలో వార్నర్‌(6), ధావన్‌(6), విరాట్‌ కోహ్లీ(6), వాట్సన్‌(5), గంభీర్‌(5) ఉన్నారు.
 
ఐపీఎల్‌ చరిత్రలో ఎక్కువ సార్లు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్న ఇండియన్‌ క్రికెటర్లలో రోహిత్‌ ముందంజలో ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 17 సార్లు హిట్‌ మ్యాన్‌ ఈ అవార్డు దక్కించుకున్నాడు.
 
చెన్నై చేపాక్ స్టేడియంలో రోహిత్ ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ గెలుపును నమోదు చేసుకున్నాడు. ఇదే చేపాక్ స్టేడియంలో రోహిత్ తొలిసారి అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

Harish Rao: ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలుగుతుంది.. హరీష్ రావు

రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

తర్వాతి కథనం
Show comments