Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ 11: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ఐపీఎల్‌ 11లో భాగంగా జైపూర్‌‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓడించింది. తద్వారా ఈ మైదానంలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (12:09 IST)
ఐపీఎల్‌ 11లో భాగంగా జైపూర్‌‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓడించింది. తద్వారా ఈ మైదానంలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో గెలిచిన రాజస్థాన్‌కు కేకేఆర్ జట్టు బ్రేక్ వేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ తొలి మూడు ఓవర్లలో నిలకడగా ఆడింది. 
 
నాలుగో ఓవర్‌లో రహానే రెచ్చిపోయి వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. దీంతో స్కోరు బోర్డు ఉరుకులేసింది. కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్, రహానే (36)ను అద్భుతమైన త్రోతో రనౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత షార్ట్ (44) మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. సంజూ శామ్సన్‌ (7), రాహుల్ త్రిపాఠి (15), బెన్ స్టోక్స్‌ (14) రాణించకపోగా, దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
 
అనంతరం, బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో రాబిన్‌ ఉతప్ప (48), సునీల్ నరైన్‌ (35‌), దినేష్ కార్తీక్ (42), నితీశ్ రాణా (35) రాణించడంతో కోల్‌కతా 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన నితీశ్ రాణా ''మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'' గా నిలిచాడు.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments