Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అదుర్స్.. 108 మీటర్ల వేగంతో సూపర్ సిక్స్..

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన సత్తా చాటుకుంటున్నాడు. ధోనీ ఫామ్‌ను కోల్పోయాడని విమర్శలొస్తున్న తరుణంలో.. విమర్శకుల

Webdunia
మంగళవారం, 1 మే 2018 (13:38 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన సత్తా చాటుకుంటున్నాడు. ధోనీ ఫామ్‌ను కోల్పోయాడని విమర్శలొస్తున్న తరుణంలో.. విమర్శకులకు తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా క్రీజులోకి వచ్చిన ధోనీ.. తనదైన స్టైల్‌లో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను పూర్తి చేశాడు. 
 
రెండేళ్ల విరామం తరువాత చెన్నై పగ్గాలు చేపట్టిన ధోనీ.. టీ20 స్టార్లకు ధీటుగా పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై తరపున బ్యాటింగ్ చేసిన కసితో బాదాడు. ఆ సిక్స్ కాస్త 108 మీటర్ల వేగంతో ప్రయాణించింది. తద్వారా ధోనీ ఐపీఎల్‌లో రికార్డు సాధించాడు. టోర్నీలోనే ఇది రెండో అత్యంత వేగంగా దూరంగా ప్రయాణించిన సిక్స్‌గా నిలిచింది. 
 
చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించిన ధోనీ.. 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సులతో 51 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ధోనీకి ఇది మూడో ఆఫ్‌సెంచరీ కావడం విశేషం. 2013 తరువాత ధోనీకి ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించగా, సోమవారం ధోనీ.. తన సూపర్ సిక్స్‌తో అదరగొట్టి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments