ఐపీఎల్ 2018 : వరుస పరాజయాలకు చెక్ పెట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయభేరీ మోగించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డీడీ నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. ఆ తర్వాత 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 55 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది.
ఢిల్లీ జట్టుకు ఎదురైన వరుస పరాజయాల నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్సీ నుంచి గౌతం గంభీర్ తప్పుకున్నాడు. దీంతో జట్టు నాయకత్వ పగ్గాలను యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాన్ అయ్యర్‌కు అప్పగించారు. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. ఫలితంగా 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.