Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : నేడు హైదరాబాద్‌తో కోహ్లీ సేనకు అగ్నిపరీక్ష

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా సోమవారం ఆసక్తికర పోటీ జరుగనుంది. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు అగ్నిపరీక్ష ఎదురుకానుంది.

Webdunia
సోమవారం, 7 మే 2018 (12:53 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా సోమవారం ఆసక్తికర పోటీ జరుగనుంది. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఎందుకంటే మంచి ఊపుమీద ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉండగా, వరుస వైఫల్యాలతో బెంగళూరు జట్టు కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
నిజానికి హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఫలితంగా 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌ గెలిస్తే రైజర్స్‌ ప్లే ఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోనుంది. కానీ, బెంగుళూరు జట్టులో కోహ్లీ, డివిల్లీర్స్‌, మెకల్లమ్‌ వంటి స్టార్లు ఉన్నా అంచనాలను అందుకోలేకపోతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో కేవలం మూడే విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. 
 
అయితే, ప్లే ఆఫ్‌లో నిలవాలంటే కోహ్లీసేన మిగిలిన అన్ని మ్యాచ్‌లూ నెగ్గాల్సిందే. దాంతో, ఒత్తిడంతా బెంగళూరుపైనే ఉండనుంది. మరి, అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రైజర్స్‌తో చావోరేవో పోరులో కోహ్లీసేన ఏం చేస్తుందో చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌ టిక్కెట్లు పదిహేను రోజుల కిందటే పూర్తిగా అమ్ముడైపోయాయి. దాంతో, స్టేడియం మొత్తం నిండిపోనుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments