Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : కోల్‌కతాపై ముంబై గ్రేట్ విక్టరీ

ఐపీఎల్ సీజన్ -11లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు గ్రేట్ విక్టరీ సాధించింది. ముందుగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల

Webdunia
సోమవారం, 7 మే 2018 (10:22 IST)
ఐపీఎల్ సీజన్ -11లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు గ్రేట్ విక్టరీ సాధించింది. ముందుగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఓడిపోయింది.
 
ముంబై ఇండియన్స్ జట్టు బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు. కోల్‌‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేయగా, ఎవిన్ లెవిస్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సహకారంతో 43 పరుగులు చేశాడు. దీంతో ముంబై పటిష్టస్థితిలో నిలిచింది. మ్యాచ్ చివర్లో బౌలర్ హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో చెలరేగిపోయాడు. 20 బంతుల్లో సిక్స్, 4 ఫోర్ల సాయంతో 35 (నాటౌట్) పరుగులు చేయడంతో జట్టు స్కోరును 180 దాటించాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 
 
ఆ తర్వాత 181 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు రాబిన్ ఉతప్ప 35 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేయగా, నితీశ్ రాణా 27 బంతుల్లో 3ఫోర్లు, ఓ సిక్స్‌తో 31, దినేశ్ కార్తీక్ 26 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్ సాయంతో 36 (నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య(2/19), మెక్లీనగన్(1/30) అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లోనూ రాణించిన హార్దిక్‌ (4-0-19-2) కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' అవార్డు దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments