Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ... 118 అంటే ఏమిటి అని అనుకుంటున్నారు.. అందుకే... కళ్యాణ్‌ రామ్‌ ఇంటర్వ్యూ

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (19:37 IST)
హీరోగా, నిర్మాతగా ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ను సెలెక్ట్‌ చేసుకుంటూ డేరింగ్‌ హీరోగా ప్రేక్షకులో తనకంటూ ఓ స్పెషల్‌ గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్‌. లేటెస్ట్‌గా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటిస్తోన్న స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌. మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో ఇంటర్వ్యూ మీకోసం..
 
ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణమేంటి? 
ముఖ్యంగా ఈ కథ బాగా నచ్చింది. అసలు సినిమా కథేంటి అనే దాన్ని సింపుల్‌గా ట్రైలర్‌లో చూపించేశాం. ప్రతి ఒక్కరూ ఓ దశలో తమ జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్‌ను ఫేస్‌ చేసే ఉంటారు. కానీ వాటి గురించి రియాక్ట్‌ అవ్వని సందర్భాలే ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటి గురించి పక్కన వాళ్లకు చెబితే వాళ్లు నవ్వుతారు. అలాంటి సిచ్యువేషన్స్‌ నా రియల్‌లైఫ్‌లో కూడా ఈ సినిమాలో చూపించినట్లు అలాగే జరిగాయి. కాబట్టి కనెక్ట్‌ అయ్యాను.
 
మీ క్యారెక్టర్‌ గురించి?
ఈ సినిమాలో నేను ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఒక విషయాన్ని లోతుగా అన్వేషించి తెలుసుకోవాలనుకునే మనస్తత్వం ఉండే వ్యక్తి క్యారెక్టర్‌లో నేను కనబడతాను. అలాంటి మనస్తత్వం ఉండే హీరో ఓ విషయాన్ని అన్వేషించుకుంటూ వెళుతుండే కథే ‘118’. దర్శకుడు కె.వి.గుహన్‌గారి లైఫ్‌లో ఓ ఇన్సిడెంట్‌ రిపీట్‌గా జరిగింది. కానీ ఆయన రియాక్ట్‌ కాలేదు. ఒకవేళ అయితే ఎలా ఉంటుంది అని అన్వేషణ చేస్తే ఏమవుతుంది అనేదే కథ. డైరెక్టర్‌గారు ఫేస్‌ చేసిన సిచ్యువేషన్స్‌కి ఇందులో సొల్యూషన్‌ కూడా చూపించారు.
 
ఈ సినిమా సూపర్‌ నేచురల్‌ థ్రిల్లరా? 
ఈ సినిమా సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కాదు. కానీ.. చూసే ప్రేక్షకులకు మాత్రం అలాంటి ఫీలింగ్‌ని కలిగించే ఓ నార్మల్‌ మూవీ.
 
టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి? 
డైరెక్టర్‌గారు కథ చెప్పిన తర్వాత రక్షణ, అన్వేషణ.. ఇలా చాలా టైటిల్స్‌ను అనుకున్నాం. కానీ అవి రొటీన్‌గా అనిపించాయి. సినిమా మొత్తం 118 చుట్టూ తిరుగుతుంటుంది. అందుకని ఆ టైటిల్‌ అయితే ఆసక్తికరంగా, కొత్తగా ఉంటుందని 118 టైటిల్‌ని ఫిక్స్‌ చేశాం.
 
కథలో ఏమైనా ఛేంజెస్‌ చేశారా? 
అలాంటిదేం లేదు. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సీన్‌ తర్వాత ఏమవుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో హీరో పాత్ర సినిమా చూసే ఆడియెన్‌ పాత్రలాగానే ఉంటుంది. అంటే హీరో రీసెర్చ్‌ చేసుకుంటూ వెళ్లే సమయంలో ఆడియెన్స్‌కు ఏ విషయాలైతే తెలుస్తాయో.. హీరోకి కూడా అదే విషయాలు తెలుస్తాయి. నేెరేషన్‌లో స్ట్రెయిట్‌ ఫార్మేట్‌ ఉంటుంది.
 
గతంలో వచ్చిన థ్రిల్లర్స్‌కి, ఈ మూవీకి ఉన్న డిఫరెన్స్‌ ఏంటి? 
ఇది కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో కూడుకున్న థ్రిల్లర్‌. ఇన్‌వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌కి ఎమోషన్‌ యాడ్‌ చేసి గుహన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే తమ్మిరాజుగారి ఎడిటింగ్‌ ఓ ఎస్సెట్‌ అవుతుంది. నేను ప్రొడ్యూసర్‌ని, డైరెక్టర్‌ని ఎలా నమ్మానో.. గుహన్‌గారు తమ్మిరాజుగారిని అలా నమ్మి ఈ ప్రాజెక్ట్‌ చేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్‌ అదే ఫీలవుతారు. ఈ జోనర్‌ యంగ్‌స్టర్స్‌కి బాగా నచ్చుతుంది.
 
కెమెరామెన్‌ డైరెక్టర్‌ అయితే చాలా బెనిఫిట్స్‌ ఉంటాయి అంటారు కదా! మీకెలా అన్పించింది?
హండ్రెడ్‌ పర్సెంట్‌ బెనిఫిట్‌ ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. చివరి ముప్పై నిమిషాలు ప్రేక్షకులకు మరో లోకంలోకి తీసుకెళుతుంది. విజువల్స్‌ అద్భుతంగా కుదిరాయి. గుహన్‌గారు ప్రతి విషయాన్ని చాలా కేర్‌ తీసుకున్నారు. ఆయన కథ, స్క్రీన్‌ప్లే, కెమెరావర్క్‌, డైరెక్షన్‌ లేకుండా ఈ సినిమా చేయడం కుదిరేది కాదేమో. ఆడియన్స్‌ని సీట్లలో కూర్చొని బెట్టే ఎడ్జ్‌ ఆఫ్‌ ది సినిమా.
 
ఈ ప్రాజెక్ట్‌లోకి మహేశ్‌ కొనేరు ఎలా వచ్చారు? 
గుహన్‌గారు కథ చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అన్పించింది. వెంటనే మా హరి, ఇతర టీమ్‌ సభ్యులతో డిస్కస్‌ చేసి చెబుతానండి.. అన్నాను. హరి, నా టీమ్‌ కూడా కథ విన్నారు. వారికి కూడా నచ్చింది. ఈ సినిమాను మా బేనర్‌లోనే నిర్మిద్దాం అనుకున్నాను. కానీ.. ఓ రోజు, మహేశ్‌ని కలిసినప్పుడు ‘ఒక అద్భుతమైన కథ విన్నాను’ అని చెప్పాను. డైరెక్టర్‌ ఎవరనే విషయాన్ని తెలుసుకున్న ఆయన ‘నేను కూడా ఓసారి కథ వింటాను’ అని చెప్పి కథ విన్నారు. ఈ సినిమా కథ మహేశ్‌గారికి చాలా బాగా నచ్చడంతో తనే ప్రొడ్యూస్‌ చేస్తానని అన్నారు. అలా మహేశ్‌ కొనేరు నిర్మాతగా సినిమా సెట్స్‌లోకి వెళ్లింది.
 
ప్రొడక్షన్‌ వేల్యూస్‌ గురించి? 
ఈస్ట్‌కోస్ట్‌ బేనర్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగా కనపడే సినిమా ఇది. నిర్మాతగా మహేశ్ గారు సినిమాను అద్భుతంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. మహేశ్‌ జర్నలిజం నుండి నిర్మాతగా మారాడు. తనకు సినిమా సెన్సిబుల్స్‌ తెలిసిన వ్యక్తి. నైస్‌ పర్సన్‌. ఈ సినిమాలో అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. దాని కోసం నేను ఈత నేర్చుకుని ముంబైలో షూట్‌ చేశాం. ఆ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుంది.
 
సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ గురించి? 
కథలో భాగంగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందే తప్ప ఎక్కడా ఫోర్స్‌డ్‌గా ఉన్నట్లు అనిపించదు.
 
ఈ సినిమాలో డైలాగ్స్‌కి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? 
సినిమాలో డైలాగ్స్‌ కూడా ఎలా ఉంటే అలా చెప్పమని అనేవారు కాదు. స్క్రిప్ట్ చదివి బాగా అర్థం చేసుకుని మనం ఆ సిచ్యువేషన్‌లో ఉంటే ఎలా మాట్లాడుతామో అలా మాట్లాడమని గుహన్‌గారు చెప్పారు. ఈ ప్యాట్రన్‌లో సినిమా చేయడం నాకూ కొత్తగానే అనిపించింది.
 
పర్టికులర్‌గా నివేదానే కీలక పాత్రకు తీసుకోడానికి రీజన్‌?
ఈ సినిమా కథ అంతా ఓ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి మంచి ప్రాధాన్యత ఉండడంతో అలాంటి క్యారెక్టర్‌ కోసం ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నివేదా అయితే యాప్ట్‌ అనిపించి తనని తీసుకోవడం జరిగింది. ‘జెంటిల్‌మెన్‌’, ‘నిన్నుకోరి’ సినిమాలు చూస్తే బేసిక్‌గా తను మంచి పెర్ఫామర్‌. రీసెంట్‌గా ‘జై లవకుశ’ చిత్రంలో కూడా అద్భుతంగా నటించింది. అందుకే ఇందులో స్ట్రాంగ్‌ ఉమెన్‌ రోల్‌ చేసింది. ఆమె చేసిన ఎమోషనల్‌ పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ తప్పకుండా మెస్మరైజ్‌ అవుతారు.
 
ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది? 
ఇటీవల రిలీజైన ఆడియోకి ఆడియన్స్‌ నుండి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. శేఖర్‌ చంద్ర ఎప్పటికప్పుడు తన మ్యూజిక్‌తో ప్రూవ్‌ చేసుకుంటూ వస్తున్నారు. ఇది రేసీగా ఉండే స్క్రీన్‌ప్లేతో కూడుకున్న కథ కాబట్టి.. మ్యూజిక్‌కి మంచి స్కోప్‌ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి సూపర్బ్‌ సంగీతం అందించారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదరగొట్టారు.
 
డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలోకి వచ్చే ఆలోచనేమైనా ఉందా? 
తప్పకుండా ఉంది. ఇటీవల సినిమాలతో పాటు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. నేను అప్పుడప్పుడు వెబ్‌ సిరీస్‌లు చూస్తుంటాను. నేను నిర్మాతగా టీనేజ్‌ లవ్‌స్టోరి జోనర్‌లో ఓ వెబ్‌ సిరీస్‌కి ప్రస్తుతం డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ప్రాజెక్ట్‌ అంతా రూపొందిన తర్వాత అనౌన్స్‌ చేస్తాను.
 
యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌లో ఇంట్రడ్యూస్‌ చేసిన ప్రతి ఒక్కరూ సక్సెస్‌ అవ్వడం ఎలా అనిపిస్తోంది? 
చాలా సంతోషంగా అనిపిస్తోంది. కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ బేనర్‌ పెట్టడం జరిగింది. కొత్తవారిని ప్రోత్సహిస్తూనే ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయడానికి నేను ప్రొడ్యూసర్‌గా డబుల్‌ కేర్‌ తీసుకొని సినిమాలు నిర్మిస్తాను.
 
సినిమా థియేటర్స్‌లో ఉండగానే డిజిటల్‌లో ప్రసారమవుతున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం? 
ఒకప్పుడు సినిమా విడుదలైన ఆరు నెలలు తర్వాత ఛానెల్స్‌లో ప్రసారమయ్యేవి. అయితే కమర్షియల్‌ ఫార్మేట్స్‌ మారుతున్నాయి. ఇప్పుడు విడుదలైన కొన్ని రోజులకే సినిమా డిజిటల్‌ మాధ్యమంలో ప్రసారమవుతుంది. అయితే అలా కాకుండా ఓ మినిమం 45-60 డేస్‌ టైమింగ్‌ ఫిక్స్‌ చేసి డిజిటల్‌ మాధ్యమంలో రిలీజ్‌ చేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
 
నిర్మాతగా, హీరోగా మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి? 
హీరోగా కొన్ని స్క్రిప్ట్స్‌ విన్నాను. ఇంకా ఏం ప్లాన్‌ చేసుకోలేదు.. ‘118’ రిలీజ్‌ తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌ ఎనౌన్స్‌ చేస్తా అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments