Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే... నా పేరు సూర్యపై కుట్ర జరుగుతోంది... హర్ట్ అయ్యాం : మెగాబ్రదర్ నాగబాబు ఇంటర్వ్యూ

"ఆరెంజ్" సినిమా ఫ్లాపైన తర్వాత ఒక ఫిలిమ్ మేకర్‌గా నేను అన్ఫిట్ అనిపించింది. అందుకే ఆ తర్వాత సినిమా నిర్మాణానికి చాలా దూరంగా ఉంటూ.. సీరియల్స్, స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లు నన్ను మళ్ళీ నిర్మాతగా మారమని ఈ ప్

Webdunia
మంగళవారం, 1 మే 2018 (20:41 IST)
"ఆరెంజ్" సినిమా ఫ్లాపైన తర్వాత ఒక ఫిలిమ్ మేకర్‌గా నేను అన్ఫిట్ అనిపించింది. అందుకే ఆ తర్వాత సినిమా నిర్మాణానికి చాలా దూరంగా ఉంటూ.. సీరియల్స్, స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లు నన్ను మళ్ళీ నిర్మాతగా మారమని ఈ ప్రొజెక్ట్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. ఒక సమర్పకుడిగా కేవలం ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించానే తప్ప కథ, దర్శకుడు అనేవి అన్నీ వాళ్ళే సెలక్ట్ చేసుకొన్నారు" అంటూ దాదాపు పదేళ్ళ తర్వాత నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్న నాగబాబు తన మనసులోని భావాలను, "నా పేరు సూర్య" విశేషాలను, తన పర్సనల్ & ప్రొఫెషనల్ లైఫ్ మేటర్స్‌ని మీడియాతో షేర్ చేసుకొన్నారు. ఆయన గొంతు సరిగా లేకపోవడం వల్ల ఇంటర్వ్యూ మొత్తం మూకీ డ్రామా తరహాలో సాగినప్పటికీ.. ఓపిగ్గా 40 నిమిషాల పాటు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు. 
 
ఆరెంజ్ బాధతో మళ్లీ నిర్మాతగా రాకూడదనుకున్నారా?
"ఆరెంజ్" సినిమా ఫ్లాప్ అయ్యింది, లాస్ వచ్చింది అనే బాధకంటే ఎక్కువగా "మగధీర" లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్‌కి మంచి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ ఎక్కువగా ఉండేది. నేను ఒక నిర్మాతగా పనికిరానేమోనని బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. అందుకే సినిమాలకు దూరంగా సీరియల్స్ చేసుకుంటూ ఉండిపోయాను. తర్వాత "జబర్దస్త్"తో నా కెరీర్‌లో ఊహించని మార్పులొచ్చాయి. 
 
మళ్లీ నిర్మాతగా మారాలని ఎందుకు అనుకున్నారు?
మూడేళ్ళ క్రితం అల్లు అరవింద్ నా దగ్గరకి వచ్చి "నువ్ మళ్ళీ నిర్మాతగా సినిమా తీయాలి" అని చెప్పారు. అయితే.. నాకు భయం, మళ్ళీ అవసరమా అని. కానీ.. అల్లు అర్జున్ నా దగ్గరకి వచ్చి "ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది" అని చెప్పడంతో మళ్ళీ నిర్మాతగా మారే ఆలోచన నా మెదడులోకి వచ్చింది. అప్పుడు లగడపాటి శ్రీధర్‌ని పార్టనర్‌గా చేసుకొని "నా పేరు సూర్య" నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. అయితే.. కథ, దర్శకుడు అన్నీ అల్లు అర్జున్ అప్పటికే సెట్ చేసుకొని ఉండడంతో మాకు పెద్దగా పని లేకుండా పోయింది. అయితే.. ఈ సినిమా నిర్మాణ సమయంలో వీళ్ళిచ్చిన ఉత్సాహంతో భవిష్యత్‌లో మళ్ళీ సినిమాలు రూపొందించాలన్న ఆలోచన మాత్రం వచ్చింది. 
 
నిర్మాతగా ఇన్వాల్వ్మెంట్ వుందా?
నిజానికి నిర్మాతలంటే రోజూ సెట్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. అందునా పెద్ద హీరోల సినిమాలంటే అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంటాయి. నేను అప్పుడప్పుడూ సెట్‌కి వెళ్లానే తప్ప ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అంతా మా బన్నీ వాసు దగ్గరుండి చూసుకున్నాడు. సినిమాలో ఎలాంటి ఆర్టిస్ట్ కావాలి అనే దగ్గరనుంచి అన్నీ తానే చూసుకున్నాడు. 
 
నిర్మాతగా ఎలా అనిపిస్తుంది?
నేను దాదాపు పదేళ్ళ తర్వాత నిర్మాతగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాను, మా అబ్బాయి హీరోగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. మా అమ్మాయి మంచి పాత్రలు చేస్తూ తన కెరీర్‌ను ప్లాన్ చేసుకొంటోంది. "జబర్దస్త్" షో జడ్జ్‌గా నేను కూడా బిజీగా ఉన్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకొంటున్నాను. 
 
వరుణ్‌తో సినిమా నిర్మించడం, నటించడం ప్లాన్ చేస్తున్నారా? 
నా ఇంట్లోనే ఒక సక్సెస్‌ఫుల్ హీరో ఉన్నాడు కాబట్టి అతనితో ఒక సినిమా తీయొచ్చు కదా అని అందరూ చెబుతున్నారు. అయితే.. వరుణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాడు హీరోగా కొత్త కథలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. వాడు బయట నిర్మాతలకు అందుబాటులో ఉండాలనే కోరుకొంటాను కానీ.. నేను క్యాష్ చేసుకోవాలన్న ఆశ ఎప్పుడూ లేదు. భవిష్యత్‌లో ఏదైనా సినిమా ప్లాన్ చేయొచ్చేమో కానీ.. ఇప్పుడైతే అలాంటి ఆలోచనేమీ లేదు. అలాగే.. వాడితో కలిసి నటించే విషయంలోనూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫ్యూచర్లో ఏదైనా మంచి సబ్జెక్ట్ వచ్చే చేస్తానేమో. 
 
చూడకుండానే బాగాలేదని టాక్ అంటూ స్ప్రెడ్ చేయడంపై... 
కొన్ని వెబ్ సైట్స్, సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా "నా పేరు సూర్య" సినిమా బాలేదంట, అవుట్‌పుట్ బాగా రాలేదంట అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. నిజంగా ఇది కొంతమంది చేస్తున్న కుట్రే. ఆ విషయంలోనే నేను, అల్లు అరవింద్ చాలా బాధపడ్డాము. సినిమా రిలీజ్ అయ్యాక బాగుంది, లేదు అని డిసైడ్ చేయొచ్చు కానీ.. రిలీజ్‌కి ముందే బాగోలేదని ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి. ఆ విషయంలో మాత్రం చాలా హర్ట్ అయ్యాం. 
 
వక్కంతం వంశీపై అంత నమ్మకమా? 
చాలామందికి వంశీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడని తెలియదు. కానీ.. నాకు అతను హీరోగా దాసరి గారి దర్శకత్వంలో చేసినప్పట్నుంచి తెలుసు. అతను అద్భుతమైన రచయిత. ఎలాంటి కథలోనైనా ఆడియన్స్‌ను ఇన్వాల్వ్ చేయగల సమర్ధుడు. "నా పేరు సూర్య" సినిమాతో దర్శకుడిగా అందర్నీ ఆకట్టుకోవడమే కాదు ఆశ్చర్యపరచడం కూడా ఖాయం. వంశీ నెక్స్ట్ ఫిలిమ్ కూడా మా కాంపౌండ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. 
 
బన్నీ క్యారెక్టరైజేషన్ హైలైట్‌గా నిలుస్తుందా..? 
సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ చాలా సీరియస్‌గా ఉంటుంది. "క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావు రాకముందు చచ్చిపోవడమే" అనే డైలాగ్ ఉంటుంది. బన్నీ క్యారెక్టర్ నిబద్ధతతో ఉంటుంది. అలాగని సినిమా మొత్తం సీరియస్‌గా ఉంటుందని అనుకోకండి, బన్నీ సీరియస్నెస్ వల్లే కామెడీ కూడా క్రియేట్ అవుతుంది. 
 
బాహుబలి తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని పెంచింది కదా? 
"బాహుబలి" విడుదలైన తర్వాత తెలుగు సినిమా స్థాయి, మార్కెట్ పెరిగింది. నేను నిర్మాతగా పదేళ్ళ క్రితం చూసిన ఇండస్ట్రీకి, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా వేరే భాషల్లో మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుండటం వల్ల మొదటి రెండు వారాల్లోనే నిర్మాత ఇన్వెస్ట్‌మెంట్ లో 80% పైగా రిటర్స్ వచ్చేస్తున్నాయి. నిజానికి ఇది మంచి విషయమే. 
 
ప్రపంచస్థాయి సినిమాల స్థాయిలో పిక్చరైజేషన్ జరుగుతోంది?
ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్‌కి వరల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఆ స్టాండర్డ్స్‌ని మన తెలుగు లేదా ప్రాంతీయ సినిమాల్లోనూ ఆ క్వాలిటీ ఉండాలని కోరుకొంటున్నాడు. అందులో తప్పేమీ లేదు, అందుకే మేం కూడా సినిమాల విషయంలో ఖర్చుకి వెనుకాడడం లేదు. ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇవ్వాలన్నదే మా తపన. 
 
భవిష్యత్‌లో పదికోట్ల లోపు బడ్జెట్ సినిమాలుండవని అనుకోవచ్చా.. 
ఇప్పుడు ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్, డిజిటల్ మీడియా కారణంగా ఆడియన్స్‌కు ఆప్షన్స్ బోలెడు ఎవైలబుల్‌లో ఉంటున్నాయి. అందువల్ల క్వాలిటీ ఉన్న కంటెంట్‌ను మాత్రమే ఆదరిస్తున్నారు. భవిష్యత్‌లో.. పదికోట్ల లోపు బడ్జెట్లో తీసే సినిమాలకు థియేటర్ రిలీజ్ ఉండకపోవచ్చు.. ఆన్‌లైన్‌లోనే పే ఫర్ వ్యూ కాన్సెప్ట్‌తో రిలీజ్ చేస్తారేమో. 
 
ప్రేక్షకులు చూసే విధానం మారిందా?
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. అందువల్ల అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ఒకవేళ "ఆరెంజ్" గనుక ఈ టైమ్‌లో రిలీజ్ అయ్యి ఉంటే హిట్ అయ్యేదేమోనని. కానీ.. ఇప్పుడైతే ఏమీ చేయలేం కదా. 
 
యంగ్ హీరోలంతా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు... ఫ్యాన్స్ బారియర్స్ లేనట్లేనా? 
ఈమధ్య ఎన్టీయార్, మహేష్ బాబు, రామ్ చరణ్‌లు కలిసి పార్టీలకి వెళ్ళడం ఫోటోలు దిగడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వాళ్ళందరూ కలిసుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అందువల్ల ఈ పరిణామం పరిశ్రమకి మంచిదనే చెప్పాలి. 
 
న్యూస్ చానల్స్ బ్యాన్ చేయాలనే చర్చ జరిగిందా? 
ఏదో ఎవరో అన్నారని కొందరు కంగారుపడుతున్నారు కానీ.. అసలు ఇప్పటివరకూ న్యూస్ చానల్స్‌ను బ్యాన్ చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. కేవలం ఇండస్ట్రీ మంచి కోసం ఏం చేయాలి అనేది మాత్రమే మేం చర్చించుకొన్నాం. 
 
ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడం లేదనే కామెంట్ పైన ఏమంటారు? 
పవన్ కళ్యాణ్ కానీ నేను కానీ ఎప్పటికప్పుడు "అనవసరమైన విషయాల మీద రియాక్ట్ అవ్వకండి అని చెబుతూనే ఉంటాం". అయితే.. ఎవరో ఒకరు పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లు వాగి.. మళ్ళీ మాకే "మీ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయండి" అని మాకు సలహాలు ఇవ్వడం అనేది ఎంతవరకూ సమంజసం అనేది వాళ్ళకే తెలియాలి. అయినా.. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా "మీరు రియాక్ట్ అవ్వకండి అని చెప్పలేం కదా". 
 
ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం.. 
అవును. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాను. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాది సినిమా ప్రారంభంలో వచ్చే పాత్ర. అలాగే.. విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ ఫిలిమ్‌లోనూ నటిస్తున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments