Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు పవన్ అంటే పిచ్చి... ఆ అవకాశం వస్తేనా...: నైరా షా ఇంటర్వ్యూ

''ఆడ, మగా.. ఇద్దరూ ఎవరికి వారు గొప్ప అనుకుంటారు. కానీ ఎదుటివాళ్ల పరిస్థితుల్లో వుండి ఆలోచించినప్పుడు ఇద్దరూ గొప్పవాళ్ళేనని తెలుసుకుంటారు. ఆడామగా అంతా సమానమే అని చెప్పే కథే 'ఇ..ఈ..'. 'ఇ' అంటే హి. 'ఈ' అంటే షీ.. ఇదే టైటిల్‌లోని అంతరార్థమని'' నటి నైరా ష

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (18:47 IST)
''ఆడ, మగా.. ఇద్దరూ ఎవరికి వారు గొప్ప అనుకుంటారు. కానీ ఎదుటివాళ్ల పరిస్థితుల్లో వుండి ఆలోచించినప్పుడు ఇద్దరూ గొప్పవాళ్ళేనని తెలుసుకుంటారు. ఆడామగా అంతా సమానమే అని చెప్పే కథే 'ఇ..ఈ..'.  'ఇ' అంటే హి. 'ఈ' అంటే షీ.. ఇదే టైటిల్‌లోని అంతరార్థమని'' నటి నైరా షా విశ్లేషించింది. ఆమె నాయికగా నటించిన చిత్రం 'ఇ..ఈ..'. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమె చిత్రం గురించి పలు విషయాలను తెలియజేసింది.
 
మీకు బాగా నచ్చిన సినిమా?
తెలుగులో 'బొమ్మరిల్లు' సినిమా చూశాను. అందులో హాసిని పాత్ర బాగా నచ్చింది. ఇందులో నేను చేసే పాత్ర పేరు కూడా హాసిని.
 
మీ పాత్ర ఎలా వుంటుంది?
కోట్లాది రూపాయల వ్యాపారం చేసే కంపెనీకి యజమానిని. చాలా కోపంగా, పొగరుగా, గర్వంగా ప్రవర్తించే పాత్ర. అయితే తర్వాత పూర్తిగా మారిపోతుంది. సంప్రదాయమైన మంచి అమ్మాయిలా తయారవుతుంది. ఆడామగా సమానమే అని చెప్పే పాయింట్‌ అందరినీ అలరిస్తుందనే నమ్మకముంది. ఇక నటిగా నాకు పూర్తిస్థాయి అవకాశమున్న చిత్రమిది. హాసిని పాత్రలో కోపం, గర్వం, మంచితనం, ప్రేమ, గ్లామర్‌ అన్నీ చూపించాను. సినిమా చూసిన ప్రేక్షకులు హాసినీ సూపర్‌ గాళ్‌ అంటారు.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోలంటే మీకు బాగా ఇష్టం?
తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ అయి వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాల్లో ఎన్‌టిఆర్‌, పవన్‌ కళ్యాణ్‌ చిత్రాలు చూశాను. వాళ్లిద్దరంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే మరీ ఇష్టం. ఛాన్స్ వస్తే వారితో సినిమాలు చేయాలనుకుంటున్నాను. తమిళంలో ధనుష్‌ నటన నచ్చుతుంది.
 
అసలు మీ సినీ ప్రవేశం ఎలా జరిగింది?
మా అమ్మా, నాన్న నటీనటులు కావాలని ముంబై వచ్చారు. దాంతో నన్నయినా చేయాలనుకున్నారు. నేను కాలేజీలో వుండగా ఎనభై కిలోల బరువు వుండేదాన్ని. కుంగ్‌ఫూలో చేరి సన్నబడ్డాను. బాలీవుడ్‌లో వారసత్వం, తెలిసినవాళ్లు లేనిదే అకాశాలు కష్టం. 'సావధాన్‌ ఇండియా' లాంటి టీవీ సీరియల్స్‌లో నటించాను. త్వరలో తెలుగులో మరో చిత్రంలో నటించబోతున్నానని'' వివరించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments