అదెలా జరిగిందో నాకు కూడా తెలియదు - హీరోయిన్ కేతిక శర్మ

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (17:15 IST)
Ketika Sharma
నాగ శౌర్య హీరోగా  స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’.  సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్‌గా కేతిక శర్మ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విలేక‌రుల‌తో మాట్లాడారు.  ఆ విశేషాలు.
 
- కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు. షూట్ మొత్తం పూర్తయింది. సంతోష్ గారు కలిసి ఓ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన కారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను.
 
- లక్ష్య సినిమాలో రితిక పాత్రను పోషించాను. ఆమె తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. లక్ష్య చిత్రం పార్దు చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే పాత్రలో రితిక కనిపిస్తుంది.
 
- నాగ శౌర్య గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. హార్డ్ వర్కింగ్, డెడికేషన్ ఉన్న నటుడు.
 
- నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్. నాకు స్విమ్మింగ్ బేస్డ్ సినిమా వస్తే చేస్తాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాగ శౌర్య గారు అద్భుతంగా నటించారు. ఎన్నో వేరియేషన్స్ కనిపిస్తాయి. నా కారెక్టర్ ఎమోషనల్‌గా ఉంటుంది.
 
మొదటి సినిమా రొమాంటిక్. పూరి జగన్నాథ్ గారి సినిమా. ఆయన్నుంచి కాల్ వస్తే ఎలా కాదనగలం. అలా పూరి జగన్నాథ్ గారు పిలవడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. రొమాంటిక్ సినిమాలో గ్లామరస్ రోల్. ఇందులో మాత్రం ఎమోషనల్ పాత్రలో కనిపిస్తాను. 
 
- లక్ష్య సినిమాలో రితిక తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంటుంది. నేను కూడా నిజ జీవితంలో అంతే. కానీ రితికలా పెళ్లి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించను. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. మనసుకు ఏదనిపిస్తే అది చేసే వాళ్లతో వేగడం కష్టం.
 
- ఆర్చరీ మీద సినిమాలు ఇంత వరకు సినిమాలు రాలేదు. అదే నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అందుకే ఈ సినిమాను చేయాలనిపించింది. ఈ సినిమా సమయంలో ఎంతో మంది ఆర్చర్స్‌ను కలిశాను. నేను కూడా ఆర్చరీ గురించి కొంచెం నేర్చుకున్నాను.
 
 - రొమాంటిక్ సినిమాలో పాట పాడాను. మా సినిమాలో ఎందుకు పాడలేదు అని లక్ష్య టీం వాళ్లు కూడా అడిగారు. త్వరలోనే డబ్బింగ్ కూడా ట్రై చేస్తాను. నా వాయిస్‌కు చిన్మయి డబ్బింగ్ చెప్పారు.
 
- ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాలేజ్, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. అదొక డైనమిక్ స్టోరి.
 
- ప్రతీ భాషలో నటించాలని ఉంది. తమిళంలో అయితే ఎక్కువ నటనను కోరుకుంటారు. నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే మొదటి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు.
 
- నా జీవితంలో ఒకే ఒక్క కల ఉండేది. నటిని అవ్వాలని అనుకున్నాను. అయ్యాను. కానీ అదెలా జరిగిందో నాకు కూడా తెలియదు. నా పేరెంట్స్ డాక్టర్స్. మాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. వారు నాకు ఓ ఏడాది టైం ఇచ్చారు. అంతలోనే నటిని అయ్యాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

తర్వాతి కథనం
Show comments