Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో హీరో కావాలనుకుని చిల్లీసాస్ గుట గుట తాగేశాడు..

సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగానే ప్రభావం చూపుతోంది. సృజనాత్మకతను వెలికితీసేందుకు సోషల్ మీడియా బాగానే ఉపయోగపడుతుందనే చెప్పాలి. కానీ కొందరు మాత్రం విచిత్రమైన వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (09:06 IST)
సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగానే ప్రభావం చూపుతోంది. సృజనాత్మకతను వెలికితీసేందుకు సోషల్ మీడియా బాగానే ఉపయోగపడుతుందనే చెప్పాలి. కానీ కొందరు మాత్రం విచిత్రమైన వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ తాజాగా ఓ వ్యక్తి బిజినెస్ పరంగా పాపులర్ అయ్యేందుకు యూట్యూబ్‌ను ఉపయోగించుకున్నాడు. ఇంకా యూట్యూబ్ హీరో కావాలనుకున్నాడు. అయితే అదికాస్తా వికటించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని బార్బెక్యూ షాపు యజమాని అయిన ఓ యువకుడు తన బిజినెస్‌ను మరింత పెంచుకోవాలనుకున్నాడు. వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ యూట్యూబ్‌లో ఫేమస్ కావాలనుకున్నాడు. ఇందుకోసం వేడి వేడి చిల్లీసాస్ గుట గుట తాగేశాడు. అయితే అదికాస్త వికటించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. గ్లాసు సాస్ తాగిన అతడు ఆ తర్వాత బాధతో కుప్పకూలిపోయాడు. 
 
ఆస్పత్రిలో చేరి రెండు వారాల చికిత్స తర్వాత బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. కొందరు నెటిజన్లు అతడిని చూసి అయ్యో అంటుంటే.. కొందరు మాత్రం ఇలాంటి పచ్చిపనులు మానుకోమని కామెంట్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments