Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ కరిగిపోయింది..

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (12:21 IST)
Island
ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ అయిన A-68 చిన్నగా మారుతోంది. ఈ మంచు కొండ క్రమంగా కూలుతూ ఉండడం ప్రారంభమైంది. ఇందులో దాదాపు 67.5 మైళ్ళు అనగా 157 చదరపు కిలోమీటర్ల మేర భారీ మంచు ఒకేసారిగా కరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సెంటినెల్-1 ఉపగ్రహం తీసిన కొత్త ఫుటేజీలో ఇది వెల్లడైంది. అంటార్కిటిక్ ద్వీప కల్పానికి ఉత్తరాన ఉన్న వెచ్చని నీటిలోకి మంచు భారీగా కదిలింది.
 
A-68 నుండి భారీ భాగం తొలగిపోవడంతో ఈ హిమానీనదం యొక్క పరిమాణం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ హిమానీనదం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దీని ముగింపుకు ఇది ప్రారంభం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఈ మంచు కొండ క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అంతరిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
 
హిమనీనద శాస్త్రవేత్త అడ్రియన్ లక్ మాన్ ప్రకారం... జూలై 2017లో లార్సెన్ సి ఐస్ షెల్ఫ్ నుండి విడిపోయిన తరువాత A-68 ఎదుర్కొన్న రెండవ అతిపెద్ద సంఘటన ఇది. అతను గత మూడు సంవత్సరాలుగా ఈ మంచు కొండ యొక్క పురోగతిని అనుసరిస్తున్నాడు. అలాగే దీని యొక్క తుది విచ్ఛిన్నం ప్రారంభమైందని కూడా ఆయన పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ మంచు కొండలో తరువాతి భాగాలు నాశనం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని లక్ మాన్ చెబుతున్నారు. 
 
A-68 ఎంతో విస్తారంగా ఉన్నప్పటికీ అది చాలా సన్నగా కనిపిస్తుంది. ఎంతో సన్నగా ఉండే ఈ మంచు కొండ ఇంత పెద్ద సముద్రంలో వుండటం ఆశ్చర్యమని లక్ మాన్ పేర్కొన్నారు. ఈ మంచు కొండకు A-68 అనే పేరు అంటార్కిటిక్‌ను క్వాడ్రంట్లుగా విభజించే వర్గీకరణ వ్యవస్థ నుండి వచ్చింది. 
 
వెడ్డెల్ సముద్రంలోని లార్సెన్ సి ఐస్ షెల్ఫ్ నుండి మంచు కొండ విరిగిపోయినప్పటి నుండి దీనికి 'A' హోదా లభించింది. అలాగే 68 అనేది ఈ మంచు కొండ శ్రేణిలో తాజా సంఖ్య. A-68 చాలా సన్నగా ఉండడం వలన అంటార్కిటికా యొక్క ఉత్తరాన పెరుగుతున్న వెచ్చని ఉష్ణోగ్రతలు, బలమైన ప్రవాహాలకు ఇది క్రమంగా అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments