Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం పెంచలేని యజమానిని చంపేసిన కార్మికుడు...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:49 IST)
అబుదాబిలో ఉపాధి కోసం వెళ్లిన పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్మికుడు హంతకుడిగా మారాడు. జీతం పెంచలేదన్న అక్కసుతో తన యజమానిని చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అబుదాబిలో నివాసముంటున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద ఓ కార్మికుడు పనిచేస్తున్నాడు. అతడి జీతాన్ని పెంచుతానని మాటిచ్చిన బాస్ మాట మీద నిలబడలేదు. జీతం పెంచాలని కార్మికుడు పలుమారు ప్రాధేయపడ్డాడు. కానీ ఇంటి యజమాని తిరస్కరించాడు. దీంతో కోపం పెంచుకుని బాస్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
తన స్నేహితుడిని వెంటబెట్టుకుని వెళ్లి మాసం కోసే ఓ కత్తిని కొనుగోలు చేశాడు. తన బాస్‌కు ఫోన్ చేసి.. స్నేహితుడి వద్దకు వెళ్లే పనుందని, కారులో తనను అక్కడ దించిరమ్మంటూ కోరాడు. కారులో దించేందుకు వచ్చిన బాస్‌ను నగర శివార్లకు తీసుకెళ్లి వెంటతెచ్చుకున్న కత్తితో హత్య చేశారు. 
 
మృతదేహంతోపాటు కారును మృతుడి ఇంటి ముందు ఉంచి అతడి ల్యాబ్‌టాప్, డబ్బులు దొంగిలించుకుని పారిపోయాడు. మరునాడు ఉదయం మున్సిపల్ కార్మికులు కారులోని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments