స్ట్రాబెర్రీ పండ్లలో సూదులు, పిన్నులు..

స్ట్రాబెర్రీ పండ్లలో సూదులు, పిన్నులు బయటపడ్డాయి. ఆస్ట్రేలియాలోని దేశీయ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్ట్రాబెర్రీ పండ్లలో ఇలాంటివి కనిపించడంతో.. ఆస్ట్రేలియాలోని ఆరు రాష్ట్రాల్లో స్ట్రాబెర్రీ విక్ర

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (14:49 IST)
స్ట్రాబెర్రీ పండ్లలో సూదులు, పిన్నులు బయటపడ్డాయి. ఆస్ట్రేలియాలోని దేశీయ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్ట్రాబెర్రీ పండ్లలో ఇలాంటివి కనిపించడంతో.. ఆస్ట్రేలియాలోని ఆరు రాష్ట్రాల్లో స్ట్రాబెర్రీ విక్రయాలను ఆపేశారు. అంతేగాకుండా సూదులు, పిన్నుల కారణంగా వినియోగదారులు వాటిని ముక్కలుగా కోసుకుని తినాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించింది. 
 
స్ట్రాబెరీలో సూది ఉన్న కారణంగా ఒక యువకుడు తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. ఈ నేపథ్యంలో స్ట్రాబెరీలను మెటల్ డిటెక్టర్లతో పరిశీలిస్తున్నారు. ఆస్ట్రేలియా నూతన ప్రధాని స్కాట్ మారిసన్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి.. 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఈ చర్యలకు పాల్పడే నిందితుల ఆచూకీ తెలిపిన వారికి సుమారు రూ.50లక్షల నజరానాను ప్రకటించింది.
 
కాగా ఆస్ట్రేలియా స్ట్రాబెర్రీలను హాంకాంగ్, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, యూఏఈలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే బిగ్ రిటైలర్ అయిన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా స్ట్రాబెర్రీల విక్రయాన్ని వెనక్కి తీసుకుంది. రష్యా, యూకే విక్రయదారులు ఆస్ట్రేలియా స్ట్రాబెర్రీల ఎగుమతిని నిషేధించాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments