Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక 17 ఏళ్ల అమ్మాయిలకు సై.. సౌదీలో డ్రైవింగ్ పర్మిట్.. కండిషన్స్ తప్పవ్!

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (19:10 IST)
Woman
మహిళల కోసం సౌదీ కొన్ని చట్టాలను అమలులోకి తెచ్చింది. ఇందులో 2017 సెప్టెంబ‌ర్‌లో మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ చేసే వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టాన్ని సౌదీ తీసుకువచ్చింది. ప్రస్తుతం 17 ఏళ్లు నిండిన యువతులకు కూడా డ్రైవింగ్ పర్మిట్ ఇవ్వనున్నట్లు చట్టం చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
17 ఏళ్లు నిండిన‌ యువ‌తులు డ్రైవింగ్ ప‌ర్మిట్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సౌదీ సర్కార్ ప్ర‌క‌టించింది. ఈ తాత్కాలిక డ్రైవింగ్ ప‌ర్మిట్ కోసం ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో యువ‌తుల‌కు మెడిక‌ల్‌ చెక‌ప్ ఉంటుంద‌ని పేర్కొంది. ద‌ర‌ఖాస్తుదారులు సౌదీయేత‌రులు అయితే రెసిడెన్సీ ప‌ర్మిట్ త‌ప్ప‌నిస‌రి. డ్రైవింగ్ స్కూళ్ల‌లో నిర్వ‌హించే థియేరిటిక‌ల్ టెస్టు పాస్ కావాలి. ఈ షరుతులతో కూడిన డ్రైవింగ్ లైసెన్సును ఇవ్వడానికి సౌదీ అరేబియా చర్యలు తీసుకుంటోంది. 
 
డ్రైవింగ్ స్కూళ్ల‌లో ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపింది. ఏడాది పాటు ఈ డ్రైవింగ్ ప‌ర్మిట్ చెల్లుబాటు అవుతుంద‌ని, 18 ఏళ్లు నిండిన త‌ర్వాత ఈ డ్రైవింగ్ ప‌ర్మిట్‌నే డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవ‌చ్చ‌ని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్ప‌ష్టం చేసింది.
 
అయితే, డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం ద‌రఖాస్తు చేసుకునే యువ‌తుల‌కు కొన్ని ప్ర‌త్యేక ష‌ర‌తులు విధించింది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేసుకునేవారిపై డ్ర‌గ్స్‌కు సంబంధించి ఎలాంటి కేసులు ఉండ‌కూడ‌దు. డ్రైవింగ్‌కు ఇబ్బంది క‌లిగించే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌రాదు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి జ‌రిమానాలు ఉంటే.. వాటిని క్లియ‌ర్ చేసుకోవాల్సి వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments