ఎనిమిదేళ్ల ప్రేమ.. బిడ్డ పుట్టాక పెళ్లంటే కట్నం తెమ్మన్నాడు.. కానీ చుక్కలు చూపించిందిగా..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (21:37 IST)
ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. ముఖ్యంగా యువతి పెళ్లి చేసుకుందామని ప్రియుడిని అడిగింది. అయితే అతడు మాత్రం ఆ యువతికి ఊహించని షాకిచ్చాడు. పెళ్లి చేసుకోవడం కుదరదన్నాడు. ఎందుకు కుదరదో తేల్చుకుందామని ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన జాంబియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే జాంబియాకు చెందిన గెట్రూడె గోమా అనే యువతి ఎనిమిదేళ్లుగా హర్బర్ట్ సలైకీతో ప్రేమలో ఉంది. అతడు భవిష్యత్‌లో పెళ్లి చేసుకుంటా అని నమ్మించడంతో అతడికి సర్వస్వం సమర్పించింది. వారి ఎనిమిదేళ్ల సహజీవనానికి ఒక సంతానం కూడా ఉంది. అయితే పెళ్లి గురించి అడిగినప్పుడల్లా సలైకీ మాత్రం ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడు. అయితే తనకు కోరికపుట్టినప్పుడల్లా గోమా దగ్గరికి వచ్చి మభ్యపెట్టి అవసరం తీర్చుకుని వెళ్లేవాడు.
 
కానీ పెళ్లి చేసుకోవాల్సిందేనని గోమా పట్టుబట్టడంతో అతడి నిజ స్వరూపం బయటపడింది. కుదరదని ముఖం చాటేశాడు. కానీ సదరు యువతి మాత్రం ప్రేమికుడికి చుక్కలు చూపించాలనుకుంది. ఇంకా కట్నం తెస్తేనే పెళ్లంటూ చెప్పేశారు. ఇదంతా విన్న ఆ యువతి.. కోర్టును ఆశ్రయించింది. 
 
ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని.. ఒక సంతానం కూడా కలిగిన తర్వాత.. కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని అర్థించింది. బాధితురాలి పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణను ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments