Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. భర్తను రోకలి బండతో మోది..?

Advertiesment
గుంటూరు.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. భర్తను రోకలి బండతో మోది..?
, బుధవారం, 9 డిశెంబరు 2020 (13:32 IST)
గుంటూరు జిల్లాలో వివాహేతర సంబంధం దారుణానికి దారితీసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో భార్య.. తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది.
 
వివరాల్లోకి వెళ్తే.., రాజీవ్ గాంధీ నగర్లో ఉండే మరియదాసు మార్బుల్స్ పని చేస్తుంటాడు. అతనికి 22 ఏళ్ల క్రితం మరియమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు సుధాకర్ మిర్చియార్డులో పని చేస్తుంటాడు. కుమార్తెకు వివాహం అయింది. 
 
కొంతకాలంగా తెనాలికి చెందిన ఆటో డ్రైవర్ అనిల్‌తో మరియమ్మ వివాహేతర సంబంధం కొసాగిస్తోంది. దీనిపై భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని మరియమ్మ ప్లాన్ వేసింది. తన ప్లాన్‌ను ప్రియుడు అనిల్‌తో చెప్పింది. 
 
పక్కా ప్లాన్ ప్రకారం.. ఈ నెల 7న రాత్రి అర్ధరాత్రి మరియదాసు ఫుల్లుగా తాగి పడుకున్న సమయంలో అనిల్, మరియమ్మ కలిసి తాడుతో గొంతు నులిమి చంపేసారు. అక్కడితో ఆగకుండా తలపై రోకలిబండతో మోదారు. దీంతో మరియదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ పోలీసుల విచారణలో ఇదంతా హత్యేనని వెల్లడి అయ్యింది. 
 
తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న మరియమ్మ-అనిల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మరియదాసు సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులంతా బ్రోకర్లే : తెలంగాణ బీజేపీ ఎంపీ వెకిలి మాటలు