Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు విడాకులు.. ఖర్చు కోసం పెళ్ళి డ్రెస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన వివాహిత!

భర్తకు విడాకుల ఇవ్వడానికి అందుకయ్యే ఖర్చుల కోసం ఓ వివాహిత తన పెళ్ళి డ్రెస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి అందరిని అబ్బురపరిచింది. ఈ వింత ఘటన బ్రిటన్‌‌లో చోటుచేసుకుంది.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (10:35 IST)
భర్తకు విడాకుల ఇవ్వడానికి అందుకయ్యే ఖర్చుల కోసం ఓ వివాహిత తన పెళ్ళి డ్రెస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి అందరిని అబ్బురపరిచింది. ఈ వింత ఘటన బ్రిటన్‌‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే...28 ఏళ్ళ సమంతా వ్రాగ్‌కు 2014లో ఓ వ్యక్తితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే సజావుగా సాగుతున్న వీరి వివాహంలో కలతలు రేగాయి. ఏడాదిన్నరకే భర్త ఆమెను వదలి మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆ భార్య అతని నుండి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. 
 
కోర్టు ఫీజులు చెల్లించడానికి పెండ్లి రోజు వేసుకొన్న దుస్తులను ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో బేరం పెట్టింది. ఆ డ్రెస్‌తో ఉన్న తన పెళ్ళి నాటి ఫోటోను కూడా పోస్ట్ చేసింది. 2014 ఆగస్టులో జరిగిన వివాహం సందర్భంగా ఇష్టపడి కుట్టించుకొన్న డిజైనర్ పెండ్లి డ్రెస్‌ను ఈ-బే సైట్‌లో అమ్మకానికి పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె పెరెంట్స్ 2000 బ్రిటన్ పౌండ్స్ (భారత కరెన్సీలో సుమారు లక్షా 74 వేలు)కు కొనుగోలు చేసిన దీన్ని 500 బ్రిటన్ పౌండ్స్ (భారత కరెన్సీలో సుమారు రూ.43,500)కు సమంతా అమ్మకానికి పెట్టింది. 
 
ఎన్నో కలలు, ఊహలతో దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన తనకు అవి ఎలాగూ దక్కలేదు. కనీసం వేరొకరికన్నా ఈ దుస్తులు సంతోషాన్ని, మంచి జీవితాన్ని నింపుతాయనే ఆశాభావాన్ని సమంత వ్యక్తం చేశారు. అలా జరగకపోతే మీరు కూడా తిరిగి దీన్ని ఇక్కడ అమ్మేయవచ్చు అని ప్రకటించింది. ఆ మహిళ అమ్మకానికి పెట్టిన గౌనుని ఇప్పటివరకు 12 మంది కొనుగోలుదారులు డ్రెస్ వివరాలపై ఆరా తీసినప్పటికి ఎవరూ బిడ్ చేయలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments