Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్‌లో తెరిస్తే.. 12 అడుగుల కొండ చిలువ కనిపించింది...

దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పెరుగు ప్యాకెట్ తీసుకునేందుకు ఫ్రిడ్జ్ డోర్‌ను ఓపెన్ చేసిన ఓ మహిళకు భయానక దృశ్యం కనిపించడంతో విస్తుపోయింద

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (10:32 IST)
దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పెరుగు ప్యాకెట్ తీసుకునేందుకు ఫ్రిడ్జ్ డోర్‌ను ఓపెన్ చేసిన ఓ మహిళకు భయానక దృశ్యం కనిపించడంతో విస్తుపోయింది. ఆ ఫ్రిడ్జ్‌లో కొండచిలువ ఒకటి తాపీగా కునుకు తీస్తుండటం చూసి భయంతో పరుగులు తీసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పెరుగు కొనుక్కుందామని ఓ మహిళ వెళ్లింది. అక్కడి ఫ్రిడ్జ్‌లో పెరుగు తీసుకుందామని ఫ్రిడ్జ్‌ తెరిచింది. అంతే అందులో 12 అడుగుల కొండచిలువను చూసి హడలిపోయింది.  వెంటనే ఆమె కేకలు వేయడంతో మార్కెట్‌ సిబ్బంది పరుగులు తీసి.. పాములు పట్టే వారిని పిలిపించి లోపలున్న కొండచిలువను బయటకు లాగారు. దాన్ని జాతీయ పార్కులో సురక్షితంగా వదిలారు. 
 
అయితే కొండచిలువ చల్లగా ఉన్న ఫ్రిడ్జ్‌లో మత్తుగా నిద్రపోతోతుండటం వల్ల మహిళకు ప్రమాదం తప్పింది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఇది ఆఫ్రికన్‌ రాక్‌ కొండచిలువని, చాలా ప్రమాదకరమని పాము పట్టడానికి వచ్చిన వారు పేర్కొన్నారు. మనుషుల్ని ఊపిరి ఆగకుండా చుట్టేసి చంపేస్తాయన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments