చైనాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (10:02 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో ఈ వైరస్ మళ్లీ ప్రతాపం చూపుతోంది. ఈ దేశంలో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
ఆ దేశ నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 31,454 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 27,515 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. దీంతో కరోనా కేసుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజుల్లో ఇన్ని వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్‌లు అమలు చేస్తుండగా, స్వదేశీ, విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నారు. అదేసమయంలో దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలోనే ఈ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జీరో కరోనా విధానం అమలుకు చైనా వైద్యాధికారులు శ్రీకారం చుట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments