రష్యా చంద్రయాన్ ప్రయోగం.. ఇస్రో కంటే ముందుగానే జాబిల్లిపై ల్యాండింగ్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (11:13 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సాఫీగా సాగిపోతుంది. ఇపుడు రష్యా కూడా ఇలాంటి ప్రయోగం చేపట్టింది. చంద్రమండలంపై దక్షిణ ధృవపు రహస్యాలను తెలుసుకునేందుకు వీలుగా లూనా-25 పేరుతో రష్యా చంద్రుడిపైకి రాకెట్‌ను ప్రయోగించింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ ల్యాండర్ భారత్ ప్రయోగించిన ల్యాండర్ కంటే రెండు రోజులు ముందుగానే ల్యాండింగ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్‌కాస్మొనాస్ ప్రకటన ప్రకారం మరో ఐదు రోజుల్లో ఈ వ్యోమనౌక నిర్దేశిత చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది. ఆత ర్వాత జాబిల్లి దక్షిణ ధృవంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజుల పాటు అన్వేషించిన తర్వాత చంద్రుడిపై దిగుతుంది. ఆగస్టు 21వ తేదీన ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మొనాస్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే యేడాది పాటు ఈ వ్యోమనౌక చంద్రుడిపై ప్రయోగాలు చేపడుతుంది. 
 
జాబిల్లిపై మట్టిని సేకరించి పరీక్షిస్తుంది. అనేక దీర్ఘకాలిక పరిశోధనలు కూడా చేపడుతుందని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. సోవియట్ యూనియన్ అనంతర కాలంలో రష్యా ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా అంతరిక్ష రంగానికి కొత్త ఊపు ఇవ్వడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఒంటరవుతున్న దేశంలో ఓ కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ప్రయోగం జరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం