Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీవర్షం.. వడగండ్లు పడుతున్నా.. రిపోర్టింగ్ చేసిన.. రిపోర్టర్.. నెటిజన్ల ప్రశంసలు..

ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు పెద్ద పెద్ద వడగళ్లు నెత్తిపై పడుతున్నప్పటికీ ఆ రిపోర్టర్ రిపోర్టింగ్ చేయడం ఏమాత్రం ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వె

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (09:00 IST)
ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు పెద్ద పెద్ద వడగళ్లు నెత్తిపై పడుతున్నప్పటికీ ఆ రిపోర్టర్ రిపోర్టింగ్ చేయడం ఏమాత్రం ఆపలేదు. దీనికి  సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గతవారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానిక న్యూస్ ఛానల్‌కు చెందిన ఓ మహిళా రిపోర్టర్ లైవ్ కవరేజీ కోసం వెళ్లింది.
 
రెయిన్ కోట్ వేసుకుని రిపోర్టింగ్ చేస్తోంది. అప్పటికే భారీ వర్షం కురుస్తుంది. వడగళ్లు కూడా పడుతున్నాయి. అవి నేరుగా నెత్తిపై పడినా, ఆమె మాత్రం రిపోర్టింగ్ మానలేదు. అంతేగాకుండా వాతావరణ పరిస్థితి చక్కగా వివరించింది. వడగళ్ల నుంచి తప్పించుకునేందుకు చేతి అడ్డుపెట్టుకున్న ఆమెను చూసిన స్టూడియోలోని న్యూస్ యాంకర్ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని చెప్తున్నా.. పట్టించుకోలేదు.
 
ఇంకా వడగళ్లు శరీరానికి బలంగా తాకుతున్నా ఆ బాధను బయటికి కనిపించకుండా జాగ్రత్త పడింది. ఆమెను చూసిన ఓ వ్యక్తి గొడుగు తెచ్చి పట్టాడు. ఈ వీడియోను న్యూస్ చానల్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు రిపోర్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments