దావూద్ ఇబ్రహీం ఇంకా బతికే వున్నాడు.. వార్తలు వైరల్

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (19:21 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో దావూద్ ఇటీవల కరాచీలోని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్లో చేరినట్లు వార్తలు వచ్చాయి. దావూద్‌కు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలకు సమయం పడుతుందని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
దావూద్ గ్యాంగ్ లీడర్ గత కొన్నాళ్లుగా పలుమార్లు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం కొన్నాళ్లుగా పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
 
భారతదేశంలో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న దావూద్ ఇబ్రహీం 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించబడ్డాడు. అతను డిసెంబర్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. తరువాత అతని కుటుంబం ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి మారింది. 1970లో ముంబై అండర్ వరల్డ్‌లో భాగమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments