Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం

Advertiesment
dawood ibrahim
, సోమవారం, 18 డిశెంబరు 2023 (08:39 IST)
పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ మాఫియా డాన్, భారత్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది దావూద్ ఇబ్రహీంపై గుర్తు తెలియని వ్యక్తి విషయ ప్రయోగం చేశాడు. దీంతో దావూద్‌ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దావూద్‌పై విష ప్రయోగం జరగడంతో తమ దేశంలో ఎలాంటి అల్లర్లు, హింసాంత్క సంఘటనలు జరగకుండా ఉండేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పాకిస్థాన్ ప్రభుత్వం నిలిపివేసినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, దావూద్‌‍పై విష ప్రయోగం జరిగిన వార్తను కూడా పాకిస్థాన్ మీడియా ప్రసారం చేస్తుంది. 
 
1996లో ముంబై వరుస పేలుళ్ళకు కారకుడై దావూద్ ఇబ్రహీం కరాచీలో తలదాచుకుంటున్న విషయం తెల్సిందే. పాక్ సాయంతో దావూద్.. భారత్‌తో పాటు అంతర్జాతీయ సంస్థలకు కూడా చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. 2003లో ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. దావూజ్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. ఆ తర్వాత కుటుంబంతో సహా ముంబైకి వలస వెళ్లాడు. 1970లో ముంబై అండర్ వరల్డ్‌లో అతడు అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో తన పరపతిని పెంచుకుంటూ అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడసాగాడు. దీంతో అతని సారథ్యంలోని గ్యాంగ్‌కు డి గ్యాంగ్‌ అనే పేరు కూడా పెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసులో కీలక మలుపు.. సునీతపై పులివెందుల పోలీసుల కేసు