Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం గాల్లో ఉండగ ఇంజిన్‌లో మంటలు

ఠాగూర్
ఆదివారం, 20 జులై 2025 (10:39 IST)
అమెరికాలో మరో విమాన ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. లాస్‌ ఏంజెలెస్ నుంచి అట్లాంటకు వెళుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన విషయాన్ని పసిగట్టిన పైలెట్లు.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. 
 
డెల్ట్ ఎయిర్‌లైన్స్‌‍కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య ఎదురైంది. ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి.. విమానాన్ని వెనక్కి మళ్లించారు. లాస్ఏంజెలస్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్ వే పైకి వచ్చి మంటలను అదుపు చేశారు.
 
ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధి కూడా ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు.
 
ఇక, ఏప్రిల్లోనూ డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో అట్లాంటాకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్టుకు సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments