Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి అమెరికా శుభవార్త

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (07:44 IST)
అగ్రరాజ్యం అమెరికా మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇందుకోసం ప్రతి ఒక్క వ్యక్తి విధిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వుంది. అలా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి అమెరికా శుభవార్త చెప్పింది. 
 
తమ దేశానికి వచ్చే ప్రయాణికుల వ్యాక్సినేషన్ పూర్తయిన పక్షంలో వారికి అనుమతులు ఇస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో గడిచిన 18 నెలలుగా అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని నవంబరు నెలలో తొలగించాలని బైడెన్ సర్కారు నిర్ణయించింది.
 
ఈ విషయాన్ని బైడెన్ ప్రభుత్వంలో కరోనా రెస్పాన్స్ కోఆర్డినేటర్‌గా ఉన్న జెఫ్రీ జియెంట్స్ వెల్లడించారు. ట్రంప్ హయాంలో విధించిన ఈ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాన్ని నవంబరులో తొలగిస్తామని జెఫ్రీ తెలిపారు. అయితే కరోనా నియంత్రణ కోసం పలు భద్రతా చర్యలు మాత్రం అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికుల వ్యాక్సినేషన్ పూర్తయ్యి ఉండాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments