ఆమెకు 61. అతడి వయసు 24. వారు పెళ్లిచేసుకున్నారు. ఆ వృద్ధ వనిత పేరు షెరిల్ మెక్‌గ్రెగోర్..ఆ కుర్రాడి పేరు కొరాన్ మెక్‌కెయిన్. షెరిల్‌కు ఏడుగురు పిల్లలైతే, కొరాన్‌కు ఇది తొలి వివాహం. అమెరికాకు చెందిన ఈ జంట ఇప్పుడు కాపురాన్ని తెగ దున్నేస్తున్నారట.
జార్జియా రాష్ట్రంలో ఉంటారు షెరిల్, కొరాన్‌లు. 2013లో వారికి తొలిసారిగా పరిచయమైంది. అప్పటికి అతడి వయసు జస్ట్ 15..! షెరిల్ కుమారుడికి చెందిన షాపులో వారు ఒకరికొకరు తారసపడ్డారు. అది స్నేహానికి దారి తీసింది.
2020 నవంబర్ 4న మరోసారి ఒకరికొకరు తారసపడ్డారు. వారి స్నేహం మరింత గాఢత సంతరించుకుంది. ఈ క్రమంలో కొరాన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో షెరిల్‌కు ప్రపోజ్ చేయడం.. ఆమె అతడి ప్రేమను అంగీకరించడం జరిగిపోయింది. సెప్టెంబర్ 3న వారు పెళ్లిచేసుకున్నారు. వారికి సన్నిహితులైన అతి కొద్దిమంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.
షేరిల్ అందమైన మహిళే కాదు.. మానసికంగా ధృఢమైనది కూడా. అసలు..ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఈ విషయమై మేము..పాజిటివ్ కామెంట్స్‌తో పాటూ నెగెటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొన్నాం.
కొందరేమో నేను డబ్బు కోసమే షెరిల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టు భావించారు. మమల్ని ఎవరెంత ద్వేషించినా సరే.. మేము మాత్రం అందరిలాగే సాధారణ జీవితాన్నే గడుపుతున్నాం అని అన్నాడు కొరాన్. సరే... ఆమెలో అతనికేం నచ్చిందో మరి!