Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ అంతుతేలుద్దాం.. కోర్టుకెక్కిన 97 టెక్ దిగ్గజ కంపెనీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధిస్తోన్న ఆంక్ష‌లు చట్టాలకు, రాజ్యాంగానికి వ

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (19:01 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధిస్తోన్న ఆంక్ష‌లు చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమ‌ని ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 
 
ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల ప్ర‌జ‌లు త‌మ దేశంలోకి రాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెల్సిందే. దీనిపై స్టే విధించేందుకు కూడా శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు అంగీకరించలేదు. ఇది ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ వంటిదే. 
 
ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్‌కు టెక్ దిగ్గజాల నుంచి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆయా కంపెనీల నుంచి లీగల్ వార్ ప్రారంభ‌మైంది. ట్రంప్ విధించిన ఆంక్ష‌ల‌కు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి 97 టెక్నాలజీ దిగ్గజాలు ఆ దేశంలోని న్యాయ‌స్థానంలో మోషన్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేశాయి.
 
ట్రంప్ ఇమ్మిగ్రేషన్స్ ఆర్డర్స్, విధిస్తోన్న ఆంక్ష‌లు చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమ‌ని ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న స‌ద‌రు నిర్ణ‌యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను తాము ఆకట్టుకోవడాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి లీగల్ పిటిషన్ ఇంత‌కు ముందు అమెజాన్, ఎక్స్ పీడియాలు కూడా దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments