Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థితో లైంగిక రిలేషన్ కోసం టీచర్ యత్నం.. ఆ ఫోటోలు వీడియో పంపించి...

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:58 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఓ టీచర్ భావించింది. దీంతో ఆ విద్యార్థిని తన దారిలోకి తెచ్చుకునేందుకు నగ్న ఫోటోలతో పాటు వీడియోలను పంపించి, రెచ్చగొట్టింది. అయితే, ఆ విద్యార్థి మాత్రం నిగ్రహం కోల్పోకుండా ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ టీచర్‌ను అరెస్టు చేశారు. అమెరికా మిస్సౌరీలోని సెంట్ జేమ్స్ అనే ప్రాంతంలో ఈ సంఘటన వెలుగు చూసింది. పాడుపనికి పాల్పడిన టీచర్ పేరు రిక్కి లిన్ లాఫ్లిన్. ఆమె వయసు 24 యేళ్ళు. ఆమె తన వద్ద చదువుకునే 16 యేళ్ళ విద్యార్థితో లైంగిక రిలేషన్ కోసం ప్రయత్నించి జైలుపాలైంది. 
 
వివాహమై భర్త కూడా ఉన్న ఆ టీచర్‌కు కామదాహం తీరకపోవడంతో విద్యార్థితో లైంగిక రిలేషన్ కోసం అలా ప్రవర్తించింది. భర్త లేని సమయంలో ఆ విద్యార్థిని ఇంటికి కూడా పిలిపించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆ విద్యార్థికి తన న్యూడ్ ఫోటోలు, వీడియోలను స్నాప్‌చాట్‌లో పంపించి తన వలలో పడేలా చేసింది. కానీ, ఆ విద్యార్థి.. టీచర్‌తో లైంగిక రిలేషన్ పెట్టుకునేందుకు నిరాకరించాడు. ఈ విషయం చివరకు తల్లిదండ్రులకు చెప్పి, చివరకు పోలీసుల వద్దకు చేరింది. దీనిపై స్పందించిన పోలీసులు... తొలుత 16 యేళ్ల బాలుడిని విచారించి, ఆ తర్వాత టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థికి న్యూడ్ ఫోటోలు వీడియోలు షేర్ చేసినట్టు టీచర్ నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం