Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా దూకుడు సరికాదు : భారత్‌కు అమెరికా మద్దతు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (12:00 IST)
భారత సరిహద్దులతో పాటు జపాన్ ఆధీనంలో ఉండే సముద్ర జలాలపై చైనా చెలాయిస్తున్న ఆధిపత్యం, ప్రదర్శిస్తున్న దూకుడు ఏమాత్రం సరికాదని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. అదేసమయంలో గాల్వాన్ లోయలో చైనా సైనికుల తీరును అమెరికా సెనెటర్లు ముక్తకంఠంతో ఖండించారు. 
 
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌ - చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా నుంచి భారత్‌కు మద్దతు పెరుగుతోంది. చైనా చర్యలను పలు వేదికలపై అమెరికా చట్టసభ ప్రతినిధులు ఖండిస్తూ భారత్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా చైనా చర్యలు ఉన్నాయని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సంధూతో అమెరికాలోని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సీనియర్‌ సెనేటర్‌ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము భారత్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. చైనా చర్యలను తిప్పికొట్టే సమర్థత భారత్‌కు ఉందని ఇటీవల గాల్వన్ ఘర్షణ ద్వారా తేలిందని చెప్పారు.
 
ఇదేవిషయంపై సెనేట్‌లో మిచ్‌ మెక్‌కన్నెల్‌ మాట్లాడారు. ఇండియా విషయంలో చైనా దూకుడును కనబరుస్తోందని విమర్శించారు. సెనేటర్‌ టామ్‌ కాటన్ మాట్లాడుతూ.. భారత సరిహద్దులతో పాటు జపాన్‌ అధీనంలో ఉండే సముద్ర జలాలపై చైనా ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments