మిసిసిపీలో తుపాకీ కాల్పుల మోత... నలుగురు మృతి

ఠాగూర్
ఆదివారం, 12 అక్టోబరు 2025 (09:24 IST)
అగ్రరాజ్యం అమెరికా దేశంలోని మిసిసిపీలోని లేలాండ్‌ పట్టణంలో జరిగిన పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం ప్రజలు ఒక చోట గుమికూడి ఉన్న సమయంలో ఓ దుండగుడు వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. మిసిసిపీ రాష్ట్ర సెనేటర్ డెరిక్ సిమ్మన్స్ కూడా ఈ కాల్పుల ఘటనను ధృవీకరించారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో పది మంది వరకు గాయపడ్డారని తెలిపారు. 
 
విద్యార్థుల పూర్వ సమ్మేళనం సందర్భంగా నిర్వహించిన మ్యాచ్ అనంతరం ప్రజలు పెద్ద ఎత్తున ఒక చోట గుమికూడి ఉన్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఈ ఘటనపై గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని జాక్సన్ నగరంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదు. అదేసమయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు లేలాండ్ పోలీస్ డిపార్టుమెంట్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments