Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక అమెరికాలో మనం సులువుగా ప్రవేశించవచ్చు.. గ్లోబల్ ఎంట్రీలో మనమూ భాగం

ఎట్టకేలకు భారతీయ ప్రయాణికులకు అమెరికా కాస్త వెసులుబాటు నిచ్చింది. ఇతర దేశాల పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా తేలికగా అమెరికాలో అడుగుబపెట్టడానికి అనుమతించే ‘గ్లోబల్‌ ఎంట్రీ’ అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్టు అమెరికా ఇటీవల ప్రకటించింది.

Webdunia
సోమవారం, 10 జులై 2017 (02:43 IST)
ఎట్టకేలకు భారతీయ ప్రయాణికులకు అమెరికా కాస్త వెసులుబాటు నిచ్చింది. ఇతర దేశాల పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా తేలికగా అమెరికాలో అడుగుబపెట్టడానికి అనుమతించే ‘గ్లోబల్‌ ఎంట్రీ’ అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్టు అమెరికా ఇటీవల ప్రకటించింది. ముందే అనుమతి పొందిన, ముప్పు కలిగించే అవకాశం లేని ప్రయాణికులు సులువుగా అమెరికాలో ప్రవేశించడానికి వీలుగా కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం (సీబీపీ) గ్లోబల్‌ ఎంట్రీని గతంలో రూపొందించింది. ప్రస్తుతం 53 అమెరికా విమానాశ్రయాల్లో ఈ గ్లోబల్‌ ఎంట్రీ ఆటోమేటెడ్‌ కియోస్క్‌లు పనిచేస్తున్నాయి. భారత్‌కు సులభ ప్రవేశం కల్గించిన అమెరికా పాక్‌ను, చైనాను రష్యాను కూడా పక్కన బెట్టడం గమనార్హం. 
 
అమెరికా హోం లాండ్‌ సెక్యూరిటీ శాఖలో భాగమైన సీబీపీ తాజా నిర్ణయం ఫలితంగా ఇక నుంచి భారతీయులు గ్లోబల్‌ ఎంట్రీ సౌకర్యం కోసం గ్లోబల్‌ ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సిస్టం(గోస్‌) వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా నిర్ణయంతో గ్లోబల్‌ ఎంట్రీ అవకాశం లభించిన పదకొండో దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న నవతేజ్‌సింగ్‌ సర్నా ఈ విధానంలో పేరు నమోదు చేయించుకున్న తొలి భారతీయుడయ్యారు. ఇప్పటికే అమెరికాతోపాటు 10 ఇతర దేశాలకు చెందిన 40 లక్షల మంది గ్లోబల్‌ ఎంట్రీ సభ్యులుగా చేరారు. అమెరికా విమానాశ్రయాల్లో వారు సంప్రదాయ సీపీబీ తనిఖీ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆటోమేటెడ్‌ కియోస్క్‌(గది)కు వెళ్లి తమ గుర్తింపు కార్డులను నిమిషాల్లో తనిఖీ చేయించుకుని అమెరికా నగరాల్లోకి ప్రవేశించవచ్చు.
 
గ్లోబల్‌ ఎంట్రీ సభ్యులు అమెరికా రవాణా భద్రత విభాగం అందించే ప్రత్యేక స్క్రీనింగ్‌ సౌకర్యం కూడా పొందవచ్చు. అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న అర్జెంటీనా, కొలంబియా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటన్‌ దేశాల పౌరులకు ఇప్పటికే గ్లోబల్‌ ఎంట్రీ అర్హతకు అనుమతి ఇచ్చారు. తాజాగా భారత్‌ ఈ జాబితాలో చేరింది. 11 దేశాలతోపాటు అమెరికా పౌరులు, జాతీయులు, చట్టబద్ధమైన శాశ్వత వాసులు కూడా గ్లోబల్‌ ఎంట్రీలో సభ్యత్వం తీసుకోవడానికి అర్హులే. అలాగే, నెక్సస్‌ ప్రోగ్రాంలో నమోదైన కెనడా పౌరులు, నివాసులు కూడా గ్లోబల్‌ ఎంట్రీకి దరఖాస్తుచేసుకోవచ్చు.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments