Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష డాలర్లు ఉన్నాయంటే చాలు. భర్తనయినా చంపేస్తారు... అమెరికాలోనూ అదే బతుకే.. థూ..!

ఆస్తి మీద చూపు పడితే భర్తలేదు, భార్య లేదు, బిడ్డల్లేదు.. మనుషులను నిలువునా పాతిపెట్టేసి ఆస్తిని కొల్లగొట్టే ఆలోచనలు ఇండియానుంచి అమెరికా దాకా ఒకే స్థాయిలో ఉన్నాయని ఈ ఘటన తేల్చి చెబుతోంది. తొలి భర్తను వదిలేసిన భార్య మళ్లీ పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే

Webdunia
సోమవారం, 10 జులై 2017 (01:46 IST)
ఆస్తి మీద చూపు పడితే భర్తలేదు, భార్య లేదు, బిడ్డల్లేదు.. మనుషులను నిలువునా పాతిపెట్టేసి ఆస్తిని కొల్లగొట్టే ఆలోచనలు ఇండియానుంచి అమెరికా దాకా ఒకే స్థాయిలో ఉన్నాయని ఈ ఘటన తేల్చి చెబుతోంది. తొలి భర్తను వదిలేసిన భార్య మళ్లీ పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే అతడి వద్ద భార నగదు ఉందని గ్రహించి దాన్ని కొల్లగొట్టడానికి కిరాయి హంతకులను పెట్టి మరీ చంపేసి దొరికిపోయిన ఘటన అమెరికాలో సంచలనం కలిగిస్తోంది. ఈ కుట్రలో తొలి భర్తద్వారా కన్న కూతురిని కూడా భాగం చేయడం బట్టబయలు కావడంతో ఇద్దరూ ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంత చేసి ఆ రెండో భర్త తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్సు పాలసీల్లో తొలి భార్య పేరునే కొనసాగించడంతో అతడి హత్యానంతరం పాలసీ డబ్బులను మొత్తంగా అతడి తొలిభార్యకే ఇవ్వనున్నారు.
 
ఉలోమా కర్రీ-వాకర్ అనే 45 ఏళ్ల మహిళ రెండో పెళ్లి చేసుకుంది. అగ్నిమాపక శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న విలియం వాకర్ అనే వ్యక్తిని తన భాగస్వామిగా స్వీకరించింది. కానీ.. పెళ్లి జరిగిన నాలుగు నెలల తర్వాత భార్యకు దుర్మార్గపు ఆలోచన వచ్చింది. డబ్బుపై ఆశతో మొదటి భర్తకు సంతానంగా జన్మించిన కూతురితో చెయ్యి కలిపింది. ‘విలియం వాకర్‌ని చంపేద్దాం.. అతని ఇన్సూరెన్స్ డబ్బులు రూ.64 లక్షలు(లక్ష డాలర్లు) తీసుకుందాం. ఎవరినైనా నియమించు’ అని చెప్పింది. 
 
అమ్మ మాట ప్రకారం కూతురు తన బాయ్‌ఫ్రెండ్‌కు సమాచారాన్ని అందించింది. రూ.64 వేలు(1000 డాలర్లు) తీసుకున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ తన సోదరుడితో ఓ పథకం రచించాడు. షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న విలియమ్‌ను తుపాకీతో కాల్చిచంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అసలు విషయాలను వెలుగులోకి తెచ్చారు. దీంతో భార్య కర్రీ-వాకర్‌కు 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఒక్కసారి కూడా పెరోల్ అవకాశాన్ని ఇవ్వకూడదని న్యాయస్థానం ఆదేశించింది. 
 
హత్య కుట్రలో భాగమైన నిందితురాలి కూతురు, హత్య చేసిన వ్యక్తులకు భారీగా జైలుశిక్ష విధించారు. ఇదిలావుండగా వీరిద్దరికీ పెళ్లై నాలుగు నెలలైనా విలియమ్ తన ఇన్సూరెన్స్ పాలసీలో భార్య పేరుని మార్చలేదు. మాజీ భార్య పేరుని అలాగే ఉంచాడు. దీంతో ఇన్సూరెన్స్ డబ్బులు మాజీ భార్యకే దక్కనున్నాయని అధికారులు తెలిపారు. 
 
అసలు విషయం ఏమిటంటే.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తను చంపేశారన్నది వార్తగా మిగిల్తే పోలీసు డిపార్ట్‌మెంటు ఊరికే వదలదు తీగలాగి డొంకంతా పట్టుకుంటుంది అనే చిన్న విషయాన్ని కూడా ఆ రెండో భార్య గ్రహించలేదా.. అవును మరి 64 లక్షల రూపాయలు కళ్లముందు కనబడుతుంటే ఇక వేరే ఆలోచనలు ఎక్కడ ఎడుస్తాయి మరి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: ఎక్సయిట్ చేసే కథలు వస్తేనే ఆడియన్స్ వస్తారు : సాయి దుర్గతేజ్

పోలీసుల్ని హీరో ఎలా కాపాడతాడు? అన్న కథే టన్నెల్ : నిర్మాత ఎ. రాజు నాయక్

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ పై స్పెషల్ సాంగ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ రాబోతున్నట్లు స్పెషల్ వీడియో

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments