Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసిస్‌ పీడ వదిలించుకున్న మోసుల్.. భారతీయ బందీల పరిస్థితి అగమ్యగోచరం

ఉగ్రవాద దాడులతో ప్రపంచాన్ని వణికించిన ఐఎస్ఐఎస్‌పై ఇరాక్ విజయం సాధించింది. ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదులపై విజయం సాధించామని ఆ దేశ ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీ ఆదివారం స్వయంగా ప్రకటించారు. ఈ ‘విముక్త’ నగరంలో ఆయన విజయ ప్రకటన చేశారని ప్రధాని కా

Webdunia
సోమవారం, 10 జులై 2017 (01:18 IST)
ఉగ్రవాద దాడులతో ప్రపంచాన్ని వణికించిన ఐఎస్ఐఎస్‌పై ఇరాక్ విజయం సాధించింది. ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదులపై విజయం సాధించామని ఆ దేశ ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీ ఆదివారం స్వయంగా ప్రకటించారు. ఈ ‘విముక్త’ నగరంలో ఆయన విజయ ప్రకటన చేశారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ‘అబాదీ మోసుల్‌కు వెళ్లి ఈ ఘన విజయాన్ని సాధించినందుకు వీర సైనికులకు, దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు’ అని వెల్లడించింది. అబాదీ మోసుల్‌లో నల్లటి సైనిక దుస్తుల్లో, తలపై టోపీతో ఉన్న ఉన్న ఫొటోను ఆయన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
 
అయితే ఆదివారం కూడా నగరంలో కాల్పులు, వైమానిక దాడులు జరిగాయి. ఆదివారం మోసుల్‌ సమీపంలోని టైగ్రిస్‌ నది దాటి పారిపోతున్న 30 మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇరాక్‌ సైన్యం తెలిపింది. మోసుల్‌ను ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్‌ బలగాలు తొమ్మిది నెలలు భీకర యుద్ధం చేశాయి. ఘర్షణలకు భయపడి 9 లక్షల మంది ప్రజలు నగరాన్ని వదలివెళ్లారు. అమెరికా సైనిక సాయంతో ఇరాక్‌ సైన్యం ఐసిస్‌ చెరలోని చాలా ప్రాంతాలను ఇదివరకే విముక్తం చేసింది.
 
ఐఎస్ ఉగ్రవాదుల ఆధీనంలోని మోసోల్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా నేతృత్వంలోని సంయుక్త బలగాలు 8 నెలలుగా అలుపులేని పోరాటం జరిపాయి. దీటుగా ప్రతిఘటించేందుకు ఐఎస్ ఉగ్రవాదులు చాలా ప్రయత్నించారు. మహిళలను బంధించి ఆర్మీపైకి సూసైడ్ బాంబర్లగా ప్రయోగించారు. పలు మార్గాల్లో పారిపోయేందుకు యత్నించిన ఐఎస్ ఉగ్రవాదులను అమెరికా నేతృత్వంలోని సంయుక్త బలగాలు తుద ముట్టించాయి. ఈ దాడుల్లో సైనికులతో పాటు మోసోల్ నగర వాసుల పెద్ద సంఖ్యలో మృతి చెందారు. బాంబు దాడుల్లో మోసోల్ నగరం పూర్తిగా ధ్వంసమైంది. దీని పున:నిర్మాణానికి బిలియన్ డాలర్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments