Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలపుంతలో కృష్ణబిలం.. తొలి చిత్రం విడుదల

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (09:41 IST)
black hole
పాలపుంత నక్షత్ర సమూహం మధ్యలో ఉన్న కృష్ణబిలం తాలూకు తొలి చిత్రం విడుదలైంది. అమెరికాకు చెందిన ఖగోళ పరిశోధకులు దీన్ని గురువారం విడుదల చేశారు. 
 
దీని బరువు సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. తాజా చిత్రానికి పరిశోధకులు సగిటారియస్‌-ఏూ (ఎస్‌జీఆర్‌-ఏ)గా వ్యవహరిస్తున్నారు.
 
జర్మనీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఖగోళ పరిశోధకులు ఏకకాలంలో ఈ వివరాలను వెల్లడించారు. 
 
భూమికి 27వేల కాంతి సంవత్సరాల సుదూరాన ఉన్న కృష్ణబిలం వద్ద జరుగుతున్న పరిణామాలపై కొత్త విషయాలను తెలుసుకునే అవకాశాన్ని ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
 
కృష్ణ బిలాన్ని చిత్రీకరించడం అనేది ఒక్క టెలిస్కోపు వల్ల అయ్యే పనికాదు. ఇందుకోసం హార్వర్డ్‌ స్మిత్సోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ షెపర్డ్‌ డోల్‌మన్‌ నేతృత్వంలో ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది.
 
ఇందులో భాగంగా హవాయ్‌, ఆరిజోనా, స్పెయిన్‌, మెక్సికో, చిలీ, దక్షిణ ధ్రువం వద్ద ఉన్న 8 టెలిస్కోపులను అనుసంధానం చేయడం ద్వారా "ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోపు (ఈహెచ్‌టీ)"అనే ఒక భారీ సాధనాన్ని తయారుచేశారు. దీన్ని ప్రయోగం కోసం వినియోగించారు. 
 
విడివిడి భాగాలతో ఏర్పడ్డ ఒక భారీ అద్దం తరహాలో ఉన్న ఈ టెలిస్కోపు 12 వేల కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక వర్చువల్‌ అబ్జర్వేటరీని ఏర్పరిచాయి. ఇది సుమారు భూమి వ్యాసానికి సమానం.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments