Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

పాలపుంతలో వింత వస్తువు.. ప్రతి 18.18 నిమిషాలకు..?

Advertiesment
Spooky
, గురువారం, 27 జనవరి 2022 (16:59 IST)
Milky Way
పాలపుంతలో ఓ వింత వస్తువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో సిగ్నల్‌ను అది భూమికి పంపిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తానూ మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నానని నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త తెలిపారు. 
 
అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా వెల్లడించారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని అన్నారు.
 
ఇకపోతే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఓ విద్యార్థి మొదట దానిని గుర్తించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ విద్యార్థి దీనిని గుర్తించాడు. దానిని ప్రస్తుతానికి "అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్" అని పిలుస్తున్నారు.
 
ప్రస్తుతం అది భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో వుంది. చాలా కాంతిమంతంగా..  అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయారని చెప్తున్నారు. అంతరిక్షం నుండి వచ్చే శక్తివంతమైన, స్థిరమైన రేడియో సిగ్నల్‌ను వేరే ఏదైనా జీవ రూపం ద్వారా పంపారా అనే ప్రశ్నపై ఆయన అంగీకారం తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ మార్కెట్‌ కోసం సరికొత్త డిష్‌వాషర్స్‌‌ని పరిచయం చేసిన హింద్‌వేర్‌