Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దెయ్యం వీడియో.. ఎలా చితకబాదిందో తెలుసా?

Advertiesment
Wat
, శనివారం, 7 ఆగస్టు 2021 (18:45 IST)
సోషల్ మీడియాలో ఓ దెయ్యానికి సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొలంబియా మేయర్ ఈ దెయ్యం అనుభవాన్ని చూశారు. కొలంబియాలో ఆర్మేనియన్ సిటీ మేయర్ జోస్ మాన్యూల్ రియోస్ మొరాల్స్ తన ఫేస్‌బుక్ పేజీలో ఓ సీసీటీవీ ఫుటేజ్‌ని షేర్ చేశారు. అందులో ఘటనకు కారణం దెయ్యమే అని ఆయన చెబుతున్నారు. తన ఆఫీస్‌లోని సెక్యూరిటీ గార్డును దెయ్యం చితకబాదిందని చెప్పారు. 
 
మేయర్ పోస్ట్ చేసిన వీడియోలో సెక్యూరిటీ గార్డ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు.. ఒక్కన ఎవరు లేరు.. కానీ ఎవరో తోసినట్లుగా ఒక్కసారిగా కిందపడ్డాడు. అక్కడి నుంచి పక్కకు లాగబడ్డాడు. అయితే చుట్టూ చూసినా ఎవరు కనిపించకపోవడంతో అతడు వణికిపోయారు. భయపడుతూ దిక్కులు చూస్తుంటే… మళ్లీ దెయ్యం గట్టిగా ఒక్కటిచ్చింది. దాంతో… వెనక ఉన్న ఏదో వస్తువుకి ధబేల్ మని తగులుకున్నాడు. ఆ తర్వాత ఆయన అరుపులు విని… ఇద్దరు వ్యక్తులు గబగబా వచ్చినట్లు వీడియో ఉంది. 
 
ఇదంతా దెయ్యం పనే అంటున్నారు మేయర్. అయితే ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డ్ పక్కన ఎవరు కనపడలేదు. దెయ్యం అంటే నీడలా అయినా కనిపిస్తుంది. కానీ ఈ వీడియోలో ఓ లైట్ వెలుతురూ పెద్దగా కనిపిస్తుంది. కనిపించని శక్తి ఏదో బలంగా కొట్టినట్లు అనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌ది రాష్ట్రాల్లో ఏ క్షణమైనా ఉప ఎన్నికల షెడ్యూల్