Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నిర్వహించిన ఏశాట్ ప్రయోగాన్ని సమర్థించిన అమెరికా రక్షణశాఖ..!

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (10:18 IST)
భారత్ నిర్వహించినటువంటి ఏశాట్ ప్రయోగాన్ని అమెరికా రక్షణ శాఖ సమర్థించింది. అంతరిక్ష ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ ఏశాట్ పరీక్షను నిర్వహించిందని, ఆ ప్రయోగం వల్ల ఎలాంటి నష్టం లేదని పెంటగాన్ తెలియజేసింది. మార్చి 27వ తేదీన దిగువ కక్ష్యలో ఉన్న ఓ ఉపగ్రహాన్ని భారత్ పేల్చివేసిన సంగతి తెలిసిందే. 
 
ఉపరితలం నుంచి గగనతలంలోని టార్గెట్‌లను చేధించే మిస్సైల్‌తో దానిని పేల్చారు. దీంతో ప్రపంచంలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలిచింది. భారత్ నిర్వహించిన ఈ పరీక్షపై నాసా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెరికా రక్షణశాఖ తాజాగా దీనిపై స్పందించింది. అంత‌రిక్ష ప్ర‌మాదాలు పొంచి ఉన్న నేప‌థ్యంలోనే భార‌త్ ఆ ప‌రీక్ష నిర్వ‌హించిన‌ట్లు యూఎస్ స్ట్రాట‌జిక్ క‌మాండ్ క‌మాండ‌ర్ జ‌న‌ర‌ల్ జాన్ హైట‌న్ తెలిపారు. 
 
భారత్ తనను తాను రక్షించుకునే సత్తా ఉంది అని నిరూపించుకోవడానికి ఆ ప‌రీక్ష చేప‌ట్టార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉప‌గ్ర‌హాన్ని పేల్చ‌డం వ‌ల్ల సుమారు 400 వ్య‌ర్థాలు ఏర్ప‌డ్డాయ‌ని, వాటి వ‌ల్ల అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ‌కు ప్ర‌మాదం ఉంద‌ని నాసా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments