Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దె కట్టలేదు.. ఇంటి పైకప్పు పెచ్చులూడిపోయి 4 పాములు వేలాడుతుంటే..?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (22:42 IST)
snakes
అద్దె బాకీ కట్టలేదని ఇంట్లోని పైకప్పు పాములను వేలాడ దీశాడు.. ఓ ఇంటి ఓనర్. ముందు ఇంటి అద్దె బాకీ మొత్తం కట్టు అప్పుడు పాములను ఇంట్లోంచి తీయిస్తాను అని తాపీగా సమాధానం చెప్పాడు. ఆ మాట విన్న అద్దెకుండే వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ వింత ఘటన జార్జియాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. హ్యారీ పగ్లీస్ అనే వ్యక్తి జార్జియాలోని టిబిలిసిలో ఓ ఇంట్లో భార్యా పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు పెచ్చులూడిపోయాయి. ఎప్పుడు పడిపోతాయా? అన్నట్లుగా ఉన్నాయి. 
 
దీనికి తోడు పెచ్చులు ఊడిపోయిన ప్రాంతంలోంచి పాములు కూడా తొంగి చూస్తున్నాయి. ఊడిపోయిన పెచ్చుల్లోంచి పాములు ఇంటిలోపలికి వేలాడుతున్నాయి. సీలింగ్‌లో ఉన్న ఎలుకల్ని తినటానికి పాములు వచ్చాయి. వాటిని చూసిన హ్యారీ దంపతులు హడలిపోయారు. దీంతో హ్యారీ ఇంటి ఓనర్ వద్దకు పరిగెత్తాడు. జరిగిన విషయం చెప్పాడు. వెంటనే పాములను తీయించమని మొరపెట్టుకున్నాడు. 
 
దానికి ఆ ఇంటి ఓనర్ తాపీగా సమాధానం ఇచ్చింది. "నువ్వు రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. ముందు అద్దె కట్టు. తర్వాత పాములు తీయించేస్తాను" అంటూ తాపీగా సమాధానం ఇచ్చింది. దీంతో షాకైన హ్యారీ పాములు ఉన్న ఆ ఇంట్లోనే భయంభయంగా రెండ్రోజులు గడిపానని స్థానిక మీడియా ద్వారా వాపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments