ఆ మహిళకు వివాహం కాలేదు. కోరికలు చంపులేకపోయింది. బాసటగా నిలిచే వ్యక్తి కోసం ఎదురుచూసింది. ఇంకేముంది ఫేస్ బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. వెంటనే యువకులు ఆమె ఫోటో చూసి క్యూకట్టారు. ఇందులో తనకు నచ్చిన యువకుడిని సెలక్ట్ చేసింది. కానీ చివరకు ఆ యువకుడి చేతిలో మోసపోయి బాధపడుతోంది.
సహజీవనం చేసినప్పటి ఫొటోలను వాడుకొని మహిళను బ్లాక్‌మెయిల్ చేసి భారీగా వసూలు చేసిన అరబ్ వ్యక్తికి అబుదాబి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.94 లక్షలు జరిమానా విధించింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళతో సహజీవనం చేసిన సయమంలో ఆమెతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తీసుకున్నాడు యువకుడు.
ఆ తరువాత వాటిని అడ్డుపెట్టుకొని ఆమెను బెదిరించిడం మొదలెట్టాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని పలుమార్లు బెదిరించి ఏకంగా కోటి 30 లక్షల వరకు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. మళ్లీ డబ్బులు కావాలని బెదిరిస్తుండటంతో బాధితురాలు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిందితుడిని అబుదాబి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో నిందితుడికి భారీ జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.